AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు.. బయటపడ్డ మట్టి కుండ.. ఏముందోనని చూడగా కళ్లు జిగేల్!

పురాతన ఇంటిని కూలగొట్టి.. తవ్వకాలు జరుపుతుండగా.. కొందరు కూలీలు కనిపించిన దృశ్యాన్ని చూసి షాక్ అయ్యారు. వారికి ఓ మట్టి కుండ దర్శనమిచ్చింది. అందులో ఏముందా అని చూడగా..

Viral: ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు.. బయటపడ్డ మట్టి కుండ.. ఏముందోనని చూడగా కళ్లు జిగేల్!
Unearthed Pot
Ravi Kiran
|

Updated on: Apr 21, 2023 | 7:44 PM

Share

గుప్త నిధులు దొరికితే ఎవరైనా ఏం చేస్తారు.. వాటి దాచిపెట్టి గుట్టుచప్పుడు కాకుండా మాయమవుతున్నారు. కానీ ఓ దినసరి కూలీ చేసిన పనికి అందరూ శభాష్ అంటున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన కూలీ హల్లె అహిర్వార్ ఓ ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు జరుపుతుండగా.. బ్రిటిష్ కాలంనాటి వెండి నాణేలు బయటపడ్డాయి. వాటిని ఇంటికి తీసుకెళ్లి, తానే దాచుకోవాలని అనుకున్నారు. ఓ రాత్రంతా నిద్ర లేకుండా గడిపారు. చివరికి మానవత్వంతో ఆలోచించి.. వాటిని ప్రభుత్వానికి అప్పగించారు.

దమోహ్ జిల్లా బదల్‌పుర గ్రామానికి చెందిన హల్లె అహిర్వార్ ఓ పాత ఇంటి వద్ద తవ్వినపుడు 1887వ సంవత్సరంనాటి 240 వెండి నాణేలు దొరికాయి. వీటిని చూసిన హల్లె షాక్ అయ్యాడు. వాటిని తన వద్దనే ఉంచుకోవాలని మొదట భావించినప్పటికీ, చివరికి పోలీసులకు అప్పగించాలని నిర్ణయించుకున్నారు. ఈ వెండి నాణేల విలువ సుమారు 2 లక్షల రూపాయల వరకు ఉండవచ్చునని తెలుస్తోంది. కొత్వాలీ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి విజయ్ రాజ్‌పుట్ హల్లె అహిర్వార్‌ను అభినందించారు. వెండి నాణేలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇదిలావుంటే, ఈ స్థలంలో నిర్మాణ పనులను నిలిపేయాలని అధికారులు ఆదేశించారు. ఈ స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించేందుకు ఆర్కియాలజీ, మినరల్స్ శాఖల అధికారులను పిలిచారు. ఈ ఇంటి ఆవరణలోనే ఓ గుడి కూడా ఉండటంతో ఇక్కడ మరింత సంపద ఉండే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు.

ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..