AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eid Moon 2023: చాంద్ ముబారక్.. కనిపించిన నెలవంక.. 22నే రంజాన్ పండుగ..

శుక్రవారం సాయంత్రం నెలవంక కనిపించింది. రంజాన్ పండుగను శనివారం జరుపుకోనున్నారు. రాంచీ, గౌహతి, హైదరాబాద్, లక్నోలో చంద్రుడు కనిపించాడు. లక్నోకు చెందిన షియా చంద్ కమిటీ చంద్రుని దర్శనాన్ని ప్రకటించింది. అరబ్ దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్ సహా గల్ఫ్ దేశాల్లో..

Eid Moon 2023: చాంద్ ముబారక్.. కనిపించిన నెలవంక.. 22నే రంజాన్ పండుగ..
Moon Sights
Sanjay Kasula
|

Updated on: Apr 21, 2023 | 8:11 PM

Share

శుక్రవారం నెలవంక కనిపించడంతో.. శనివారం నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభంకానున్నట్లు ముస్లిం మత పెద్దలు ప్రకటించారు. పవిత్రతే పరమపదసోపానంగా భావించే రంజాన్‌ పండుగ శనివారం జరగనుంది. దేశంలో శుక్రవారం సాయంత్రం ఈద్ చంద్రుడు కనిపించాడు. దీంతో శనివారం (ఏప్రిల్ 22) ఈద్ జరుపుకోనున్నారు. రాంచీ, గౌహతి, హైదరాబాద్, లక్నోలో చంద్రుడు కనిపించాడు. లక్నోకు చెందిన షియా చంద్ కమిటీ చంద్రుని దర్శనాన్ని ప్రకటించింది. అరబ్ దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్ సహా గల్ఫ్ దేశాల్లో శుక్రవారం (ఏప్రిల్ 21) ఈద్-ఉల్-ఫితర్ జరుపుకున్నారు.

భారతదేశంలో రంజాన్ మాసం చివరి శుక్రవారం వీడ్కోలు ప్రార్థనలు జరిగాయి. దీంతో రంజాన్‌ ఉపవాసాల 29 పూజలు, స్వచ్ఛత పూర్తయ్యాయి. సాయంత్రం ఈద్ చంద్రుని కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. చివరకు సాయంత్రం చంద్రుడు కనిపించాడు.

ముగిసిన రంజాన్ మాసం..

పవిత్ర రంజాన్ మాసం ముగిసిన తర్వాత ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం షవ్వాల్ నెల మొదటి రోజున ఈద్ జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం సమాజం ఈ పవిత్ర మాసంలో ఉపవాసం పాటిస్తారు. నెలంతా అల్లాను ఆరాధిస్తారు. సౌదీ అరేబియాలో 29 రోజుల రంజాన్ ఏప్రిల్ 20 న పూర్తయింది. కాబట్టి అక్కడ ఏప్రిల్ 21 న ఈద్ జరుపుకుంటారు.

భారతదేశంలో కూడా శుక్రవారం చంద్రుడిని చూసిన తర్వాత  ఏప్రిల్ 22న ఈద్ జరుపుకోవాలని భావించారు. ఈద్‌కు ఒక రోజు ముందు, రోజెదార్‌లతో సహా ఇతరులు వీడ్కోలు ప్రార్థనలు చదివారు. హజ్రత్ ఆదం అలైహిస్సలాం స్వర్గం నుంచి ఈ లోకానికి శుక్రవారం నాడు పంపబడ్డారని హదీస్ షరీఫ్‌లో పేర్కొనబడింది.

శుక్రవారమే స్వర్గానికి తిరిగి వచ్చినట్లు చెబుతారు. అందుకే శుక్రవారం నాడు ప్రార్థనలు చేస్తే పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. శుక్రవారం ఒక్క ప్రార్థన చేస్తే 40 ప్రార్థనలు చేసినంత ఫలం లభిస్తుందని నమ్మకం.

మరిన్ని జాతీయ వార్తల కోసం