Hyderabad Rent: అయ్యబాబోయ్.. హైదరాబాద్‌లో మండిపోతున్న అద్దెలు.. కట్టాలంటే అప్పు చేయాలేమో!
హైదరాబాద్ మహా నగరంలో హౌస్ రెంట్స్...కరెంట్ షాక్ ఇచ్చేలా ఉన్నాయి. అయితే అద్దెకు ఉండేవాళ్లు ఈ షాక్ ట్రీట్‌మెంట్‌కు అలవాటు పడిపోయారు.
హైదరాబాద్ మహా నగరంలో హౌస్ రెంట్స్…కరెంట్ షాక్ ఇచ్చేలా ఉన్నాయి. అయితే అద్దెకు ఉండేవాళ్లు ఈ షాక్ ట్రీట్‌మెంట్‌కు అలవాటు పడిపోయారు. అయితే భవిష్యత్తులో ఈ షాక్ లెవెల్స్ ఇంకా పెరుగుతాయని అనరాక్ లాంటి ప్రాపర్టీ రీసెర్చ్ సంస్థలు చెబుతున్నాయి. ప్రస్తుతానికి మన భాగ్య నగరంలో అద్దెలు ఫరవాలేదు అన్నట్టు ఉన్నా ఉన్నా…భవిష్యత్తులో బెదరహో అనే లెవెల్‌కు చేరే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. బెంగళూరులో అయితే ఇప్పటికే బెంబేలెత్తించే లెవెల్లో ఉన్నాయి. దాంతో పోలిస్తే మన దగ్గర మచ్ బెటర్ అంటున్నారు. దేశంలోని మిగిలిన మహా నగరాలతో పోలిస్తే ఇళ్ల రెంట్ల విషయంలో హైదరాబాద్ బెటర్ అంటున్నారు ఎక్స్‌పర్ట్స్.
దేశంలోని ఇతర నగరాలో ఇళ్ల అద్దెలు అదరహో అనిపిస్తున్నాయి. భవిష్యత్తులో మరింత బెదరహో అనిపించే లెవెల్లో ఉంటాయట. మన భాగ్య నగరంలో కూడా ఇళ్ల అద్దెలు ఎక్కువగానే ఉన్నప్పటికీ…బెంగళూరుతో పోలిస్తే బెటర్ అంటున్నారు నిపుణులు. అయితే భవిష్యత్తులో మనకు కూడా డేంజర్ బెల్స్ తప్పవట. ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ నగరాల్లో ఏడాది కాలంలో పెరిగిన థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఇళ్ల అద్దెల యావరేజ్ వివరాలను చూద్దాం. …
హైదరాబాద్ హైటెక్ సిటీలో థౌజండ్ స్వేర్ ఫీట్ ఇంటి అద్దె ఏడాది క్రితం 24 వేల రూపాయల ఉంటే ఇప్పుడు 26800 రూపాయలు అయింది. అంటే ఏడాదిలో అద్దె 12 శాతం పెరిగింది. ఇక గచ్చిబౌలిలో 2022లో 23 వేల రూపాయల రెంట్ ఉంటే ఇప్పుడు 25600 రూపాయలు అయింది. 11 శాతం పెరిగింది. కొండాపూర్‌లో గత ఏడాది థౌజండ్ స్క్వేర్ ఫీట్ హౌస్ రెంట్ 21500 రూపాయలు ఉంటే ఇప్పుడు అది 24 వేల రూపాయలకు చేరుకుంది. అంటే 12 శాతం పెరిగింది.
ఇక దేశంలో అద్దెలు బెంబేలెత్తించే లెవెల్లో పెరుగుతున్న మహా నగరాల్లో బెంగళూరు ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. బెంగళూరు సర్జాపూర్ రోడ్ ఏరియాలో థౌజండ్ స్క్వేర్ ఫీట్ హౌస్ రెంట్ ఏడాది క్రితం 22500 రూపాయలు ఉంటే..అది ఇప్పుడు 27వేలకు చేరింది. అంటే 20 శాతం పెరిగింది. ఇక మరతహల్లి ORR ఏరియాలో సంవత్సరం కిందట 225000 రూపాయల ఉన్న ఇంటి అద్దె ఇప్పుడు 28 వేలకు పెరిగింది. అంటే ఒక్క ఏడాదిలోనే 24 శాతం రెంట్ పెరిగింది. ఇక వైట్‌ఫీల్డ్ ఏరియాలోని వెయ్యి చదరపు అడుగుల ఇంటి అద్దె గత ఏడాది 21900 రూపాయలు ఉంటే..అది ఇప్పుడు 26500కి చేరిందది. అంటే 21 శాతం పెరిగింది. ఇక తనీసాంద్ర మెయిన్‌రోడ్‌లో కిందటి ఏడాది 21 వేల రూపాయలు ఉన్న అద్దె ఇప్పుడు ఏకంగా 26 వేలకు చేరుకుంది. అంటే 24 శాతం పెరిగింది. దేశంలోనే బెంగళూరులో ఇళ్ల అద్దెలు అత్యధికంగా పెరుగుతున్నాయి.
ఇక చెన్నయ్‌లోని పెరంబూర్‌లో థౌజండ్ స్క్వేర్ ఫీట్ హౌస్ రెంట్ ఏడాది క్రితం 16800 రూపాయలు ఉంటే ఇప్పుడు 18500కి చేరింది. అంటే 10 శాతం అద్దె పెరిగింది. పల్లవరం ఏరియాలో లాస్ట్ ఇయర్ 15500 రూపాయలు ఉన్న అద్దె ఇప్పుడు 18 వేలకు చేరింది. అంటే 16 శాతం రెంట్ పెరిగింది. ఇక ఒరగడం ప్రాంతంలో కిందటి ఏడాది 12200 రూపాయలు ఉన్న అద్దె ఇప్పుడు 13500కి చేరింది. అంటే 11 శాతం పెరిగింది.
దేశ రాజధాని ఢిల్లీ-NCR…నేషనల్ కేపిటల్ రీజియన్‌లోని సోహ్నా రోడ్‌లో సంవత్సరం కిందట థౌజండ్ స్క్వేర్ ఫీట్ హౌస్ రెంట్ 26 వేల రూపాయలు ఉంటే ఇప్పుడు అది 29500కి చేరింది. అంటే 13 శాతం పెరిగింది. ఇక నోయిడా-సెక్టార్ 150లో లాస్ట్ ఇయర్ 16500 రూపాయలు ఉంటే ఇప్పుడు అది 19 వేలకు చేరింది. అంటే 15 శాతం పెరిగింది. ఇక ద్వారకా ఏరియాలో ఏడాది కిందట 20 వేల రూపాయలు ఉన్న అద్దె ఇప్పుడు 22 వేలకు చేరింది. అంటే 10 శాతం పెరిగింది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని చెంబూర్‌లో థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఇంటి అద్దె సంవత్సరం క్రితం 49500 రూపాయలు ఉంటే..ఇప్పుడు అది 58 వేలకు చేరింది. అంటే 17 శాతం పెరిగింది. ములుంద్ ఏరియాలో లాస్ట్ ఇయర్ 40 వేల రూపాయలు ఉన్న అద్దె ఇప్పుడు 45400కి చేరింది. ఏడాదిలో 14 శాతం రెంట్ పెరిగింది. ఘోడ్‌బందర్ రోడ్‌లో లాస్ట్ ఇయర్ 28 వేల రూపాయలు ఉన్న ఇంటి అద్దె ఇప్పుడు 32 వేలకు చేరింది. ఏడాదికి 14 శాతం అద్దె పెరిగింది.
ఇక కోల్‌కతాలోని ఈఎం బైపాస్ ఏరియాను చూస్తే గత ఏడాది 19500 రూపాయలుగా ఉన్న అద్దె ఇప్పుడు 13 శాతం పెరిగి 22 వేలకు చేరింది. రాజర్‌హాట్ ప్రాంతంలో అద్దెలు 10 శాతం పెరిగి 15 వేల నుంచి 16500కి చేరాయి. జోకా ఏరియాలో ఏడాదిలో 11 శాతం రెంట్ పెరగడంతో 13500 నుంచి 15 వేల రూపాయలు అయింది.
దేశంలో బెంగళూరులో అత్యధికంగా ఇళ్ల అద్దెలు పెరుగుతుంటే హైదరాబాద్‌లో మాత్రం ఫరవాలేదు అనిపించే స్థాయిలోనే రెంట్లు పెరుగుతున్నాయి. అద్దెలు ఏడాదికి 20% చొప్పున పెరుగుతూ బెంగళూరు దేశంలోనే ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ముంబై,ఢిల్లీ తరువాత వరుసలో వున్నాయి. సో…దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో రెంటల్స్ తక్కువ. ఇక హైదరాబాద్‌లో యాక్సిసిబిలిటీ కూడా ఎక్కువే. నగరంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా త్వరగా వెళ్లిపోవచ్చు. మెట్రో, ఫ్లై వోవర్లు, ORR వల్ల కనెక్టివిటీ బాగా పెరిగింది. అయినా ఇప్పటిదాకా అద్దెలు అందుబాటులోనే ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోని విశాఖ, విజయవాడ, రాజమండ్రి, వరంగల్, కరీంనగర్, తిరుపతి, గుంటూరు లాంటి నగరాల్లో గత మూడేళ్లలో దాదాపు 40 శాతం అద్దెలు పెరిగాయని చెబుతున్నారు.
అయితే భవిష్యత్తులో మనల్ని కూడా భయపెట్టే రేంజ్‌లో హైదరాబాద్‌లో రెంట్లు పెరుగుతాయంటున్నారు నిపుణులు. ఎందుకంటే హైదరాబాద్‌కి మైగ్రేషన్ పెరుగుతోంది. ప్రజలే కాదు ఐటీ కంపెనీలు కూడా భాగ్య నగరానికి తరలివస్తున్నాయి. గత ఏడాది బెంగళూరు నుంచి హైదరాబాద్‌కి చాలా ఐటీ కంపెనీలు తరలి వచ్చేశాయి. ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ కావడంతో జనంతో పాటు కంపెనీలు కూడా చలో హైదరాబాద్ అంటున్నాయి. ఈ నేపథ్యంలో అద్దెల గురించి కూకట్‌పల్లిలోని ఇంటి ఓనర్లు, అద్దెకు ఉండేవాళ్లు, రెంటల్ బ్రోకర్లు ఏమంటున్నారో చూద్దాం.
ఇప్పటిదాకా హైదరాబాద్‌లో అద్దెలు భరించే స్థాయిలోనే ఉన్నాయి. అయితే భాగ్య నగరానికి వలసలు పెరగడం, కంపెనీలు పెద్దఎత్తున వస్తుండడంతో భవిష్యత్తులో అద్దెలు బాబోయ్ అనే లెవెల్‌కు చేరే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు.