Hyderabad: కూల్ న్యూస్.. వచ్చే 3 గంటల్లో ఈదురుగాలులతో వర్షాలు.. ఈ ప్రాంతాలకు అలెర్ట్.!

తెలంగాణ ప్రజలకు కూల్ న్యూస్. వరుణుడు కరుణించాడు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అలాగే రానున్న మూడు గంటల్లో..

Hyderabad: కూల్ న్యూస్.. వచ్చే 3 గంటల్లో ఈదురుగాలులతో వర్షాలు.. ఈ ప్రాంతాలకు అలెర్ట్.!
Rains
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 21, 2023 | 7:44 PM

తెలంగాణ ప్రజలకు కూల్ న్యూస్. వరుణుడు కరుణించాడు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అలాగే రానున్న మూడు గంటల్లో రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్, నాగర్ కర్నూల్, మెదక్ జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అటు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని చెప్పింది.

ఇదిలా ఉంటే.. ఏప్రిల్ 22 నుంచి ఏప్రిల్ 25 వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని వాతావరణశాఖ స్పష్టం చేసింది. కాగా, గురువారం రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసాయి. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో అత్యధికంగా 16.4 మిల్లీమీటర్ల వర్షపాతం.. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్‌లో 9 మి.మీ వర్షపాతం నమోదైంది. అటు ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో కురిసిన వర్షానికి, ఈదురుగాలులకు మామిడికాయలు నేలమట్టమయ్యాయి. జగిత్యాల జిల్లా కోరుట్ల, మెట్‌పల్లిలో తీవ్రమైన పంట నష్టం వాటిల్లడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో