AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: స్లీపర్ క్లాస్ టికెట్‌తో ఏసీ కోచ్‌లో ప్రయాణించాలా.? అయితే ఇలా చేయండి.!

ఈ సమ్మర్ హాలిడేస్‌లో ఏదైనా టూర్ లేదా సొంతూళ్లకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా.? రైలు టికెట్ బుక్ చేసుకున్నారా.? అయితే మీకో అదిరిపోయే ఫీచర్ గురించి చెప్పబోతున్నాం.

Indian Railways: స్లీపర్ క్లాస్ టికెట్‌తో ఏసీ కోచ్‌లో ప్రయాణించాలా.? అయితే ఇలా చేయండి.!
Indian Railways
Ravi Kiran
|

Updated on: Apr 24, 2023 | 9:28 AM

Share

స్కూల్స్, కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించారు. ఈ సమ్మర్ హాలిడేస్‌లో ఏదైనా టూర్ లేదా సొంతూళ్లకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా.? రైలు టికెట్ బుక్ చేసుకున్నారా.? అయితే మీకో అదిరిపోయే ఫీచర్ గురించి చెప్పబోతున్నాం. స్లీపర్ క్లాస్ టికెట్‌తో ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందామా.!

పైన పేర్కొన్న సౌలభ్యాన్ని మీరు ఎంచుకోవాలంటే.. రైలు టికెట్ బుక్ చేసుకునప్పుడు.. ఆటో అప్‌గ్రేడేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి. గతంలో రిజర్వేషన్ టికెట్లను పద్దతి ప్రకారం.. ప్రయాణీకులు ఎంచుకున్న కోచ్‌లోనే బెర్త్ లభించేది. ఒకవేళ ఆ బోగీలో బెర్త్ లేకపోతే టికెట్ ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అయ్యేది. కానీ ఇప్పుడు అలా కాదు.. ఈ ఫీచర్ ద్వారా ప్రయాణీకులకు తాము ఎంచుకున్న కోచ్‌లో బెర్త్ దొరక్కపోతే.. వారికి అంతకంటే హయ్యస్ట్ కోచ్‌లో సీట్ లభిస్తుంది. కానీ ఇది జరగాలంటే ఆ బోగీలో కచ్చితంగా సీటు ఖాళీగా ఉండాలి. దీనికి ఎలాంటి అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఇవి కూడా చదవండి

ఉదాహరణకు ఈ అటో అప్‌గ్రేడేషన్ ఆప్షన్ ద్వారా ఓ ప్రయాణీకుడు స్లీపర్ క్లాసులో టికెట్లు బుక్ చేసుకున్నట్లయితే.. ఆ బోగీలో బెర్త్ ఖాళీ లేకపోతే.. అతడికి థర్డ్ ఏసీలో ఖాళీగా ఉన్న బెర్త్ లభించే ఛాన్స్ ఉంది. ఒక్క స్లీపర్ క్లాస్ ప్రయాణీకులకు మాత్రమే కాదు.. ఈ ఆప్షన్ ద్వారా థర్డ్ ఏసీ వారికి.. సెకండ్ ఏసీ, సెకండ్ ఏసీ వారికి ఫస్ట్ ఏసీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సౌకర్యం కేవలం హయ్యర్ కోచ్‌ల్లో సీట్లు అందుబాటులో ఉన్నప్పుడే లభిస్తుంది. కాగా, ఈ ఆప్షన్ ఎంచుకున్న చాలామంది స్లీపర్ క్లాస్ రైలు టికెట్లతో థర్డ్ ఏసీలో ప్రయాణించారు. ఇది కేవలం ఆన్‌లైన్ ద్వారా ఐఆర్‌సీటీసీలో బుక్ చేసుకున్నవారికి మాత్రమే.. కౌంటర్లలో బుక్ చేసుకునేవారికి ఈ ఫీచర్ పనిచేయదు.

ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే