Rent AC: ఏసీ కొనాలని ప్లాన్ చేస్తున్నారా.? ఇలా చేస్తే డబ్బులు తగ్గుతాయ్.!
సూర్యుడి భగభగకు.. జనాలు ఉక్కపోతతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. మీరూ ఈ వేసవిలో ఏసీని కొనాలని ప్లాన్ చేస్తున్నట్లయితే.? ఒకవేళ అనువైన బడ్జెట్‌లో మీకు ఏసీ దొరకకపోతే..?
సూర్యుడి భగభగకు.. జనాలు ఉక్కపోతతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. మీరూ ఈ వేసవిలో ఏసీని కొనాలని ప్లాన్ చేస్తున్నట్లయితే.? ఒకవేళ అనువైన బడ్జెట్‌లో మీకు ఏసీ దొరకకపోతే..? మీకో గుడ్ న్యూస్.. ఏసీ, కూలర్‌ను అద్దెకు తీసుకోవచ్చు. మరి అదెలాగో తెలుసుకుందామా.?
ఆన్‌లైన్‌లో ఏసీ, కూలర్‌లను అద్దెకు ఇచ్చే Rentomojo, Rentloco, CityFurnish, Fairent లాంటి పలు ఈ-కామర్స్ సైట్లు ఉన్నాయి. ముఖ్యంగా అద్దె ఇంటిలో ఉండేవారి కోసం ఈ సర్వీసు ఉపయోగపడుతుంది. ఇల్లు మారిన ప్రతీసారి మీరు ఏసీని మోసుకెళ్లాల్సిన పన్లేదు. ఇలా అద్దెకు తీసుకుంటే చాలు. సదరు వెబ్‌సైట్లు ఈ అద్దె ఏసీ సర్వీసులు హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, నోయిడా లాంటి ఇతర మెట్రోపాలిటన్ నగరాల్లో అందుబాటులో ఉంచాయి. కేవలం నెలకు మినిమం రూ.1,100 అద్దెకు ఏసీలు లభిస్తాయి.
-
Rentomojo: ఇందులో ఏసీ అద్దె రూ. 1,399 నుంచి మొదలవుతుంది. అలాగే 1 టన్ స్ప్లిట్ ఏసీకి రూ.1,949 రీఫండబుల్ డిపాజిట్ చెల్లించాలి. ఇక రూ. 1,500 ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు.
-
CityFurnish: ఇందులో 1 టన్ విండో ఏసీ నెల అద్దె రూ.1,069. ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు వెయ్యి రూపాయలు. అలాగే రూ.2,749 రీఫండబుల్ డిపాజిట్ చెల్లించాలి.
-
Fairent: ఈ సైట్‌లో 1.5 టన్ విండో ఏసీ నెలకు అద్దె రూ.1,375. ఇక్కడ అన్ని కూడా ప్యాకేజీల పరంగా ఉంటాయి. ఇతర సర్వీసు ఛార్జీలు కూడా అందులో జోడిస్తారు.