Andhra Pradesh: తల్లి మరణవార్త విని ఆగిపోయిన కొడుకు గుండె.. తల్లీ కొడుకుల మృతితో గ్రామంలో విషాదం..
కన్నీరు మున్నిరైన బందువులు ఉపాధి నిమిత్తం హైదరాబాద్ లో అంటోన్న స్వయం ప్రభ ఒక్కగానొక్క కుమారుడు వెంకటేష్ కి ఫోన్ చేసి విషయం చెప్పారు. త్వరగా బయలుదేరి రమ్మన్నారు. అంతే.. ఇలా ఫోన్ కట్ చేసారో లేదో హైదరాబాద్ నుండి కొట్టుగుమ్మడ లోని బంధువులకు తిరిగి ఫోన్ వచ్చింది. తల్లి మరణ వార్త విన్న వెంటనే వెంకటేష్ కుప్ప కూలి పోయి మృతి చెందాడని అతని భార్య పావని ఏడుస్తూ ఫోన్ చేసి చెప్పింది.
పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం కొట్టు గుమ్మడ గ్రామం. సమయం సోమవారం ఉదయం ఏడు గంటలు. అప్పటి వరకు ఇంట్లో టీవీ చూస్తూ ఉన్న గుడివాడ స్వయం ప్రభ(68యేళ్లు) ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. గమనించిన బందువులు ముఖంపై నీళ్లు చల్లి లేపే ప్రయత్నం చేశారు. అయిన ఆమెలో చలనం లేదు. డాక్టర్ ను పిలిపించి చూపించారు. అప్పటికే ఆమె గుండె పోటుతో మృతి చెందినట్లు డాక్టర్ ధృవీకరించారు. కన్నీరు మున్నిరైన బందువులు ఉపాధి నిమిత్తం హైదరాబాద్ లో అంటోన్న స్వయం ప్రభ ఒక్కగానొక్క కుమారుడు వెంకటేష్ కి ఫోన్ చేసి విషయం చెప్పారు. త్వరగా బయలుదేరి రమ్మన్నారు. అంతే.. ఇలా ఫోన్ కట్ చేసారో లేదో హైదరాబాద్ నుండి కొట్టుగుమ్మడ లోని బంధువులకు తిరిగి ఫోన్ వచ్చింది. తల్లి మరణ వార్త విన్న వెంటనే వెంకటేష్ కుప్ప కూలి పోయి మృతి చెందాడని అతని భార్య పావని ఏడుస్తూ ఫోన్ చేసి చెప్పింది. తల్లిని కడసారి చూసి తలకొరివి పెడతాడనీ వెంకటేష్ రాక కోసం ఎదురు చూస్తున్న బంధువులు, గ్రామస్తులు అతని మరణ వార్త విని షాక్ అయ్యారు. పావుగంట వ్యవధిలోనే తల్లి, కొడుకు మృతి చెందారన్న వార్త అందరినీ కలిచి వేసింది. గ్రామములో తీవ్ర విషాదాన్ని నింపింది.
బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఏమిటి ఈ విధి రాత అంటూ ఆ నోట ఈ నోట ఇప్పుడు ఈ వార్త చర్చకు దారి తీస్తుంది. వెంకటేష్, స్వయం ప్రభలకు ఒకరంటే ఒకరికి ఎంతో మమకారం. వెంకటేష్ 20 ఏళ్లుగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. స్వగ్రా మంలో ఉన్న తల్లికి ప్రతినెలా డబ్బులు పంపిస్తూ ఉంటాడు. ఎప్పటికప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి ఆమె యోగ క్షేమాలు అడిగి తెలుసుకుంటూ ఉంటాడు. అయితే ఒక్కసారిగా తల్లి మరణ వార్త విన్న వెంకటేష్ తీవ్ర మనో వేదనకు గురై వెంటనే కుప్పకూలిపోయాడు. వెంకటేష్ కి భార్య పావని, రవితేజ, రాకేష్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. తీవ్ర విషాదం నడుమ వెంకటేష్, స్వయం ప్రభ మృతదేహాలకు మంగళవారం స్వగ్రామమైన కొట్టు గుమ్మడలో అంత్యక్రి యలు నిర్వహించారు.వెంకటేష్ కుమారుడు రవితేజ తన తండ్రికి, నాన్నమ్మకు తలకొరివి పెట్టాడు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..