Viral Video: శివయ్యకు అభిషేకం కోసం కావిడిలో తల్లిని ఓ వైపు, గంగాజలాన్ని ఓవైపు తీసుకుని వెళ్తున్న భక్తుడు.. కలియుగ శ్రవణుడే ఇతడు..
కన్వర్ యాత్ర మొదలై రహదారులన్నీ భక్తులతో నిండిపోయాయి. ఈ యాత్రలో పలువురు భక్తులు పాల్గొన్న వీడియోలు ఇప్పటికే వైరల్ అవుతున్నాయి. ఇందులో ఓ యువకుడు కావిడి ఎత్తుకుని వెళ్తున్నాడు. ఆ కావిడి లో ఒక వైపు తన తల్లిని ..మరోవైపు గంగాజలాన్ని భుజాలపై ఎత్తుకుని వెళ్తున్న వీడియో అందరినీ ఆకర్షిస్తోంది.
ఉత్తర భారత దేశంలో శ్రావణ మాసం మొదలైంది. ఎక్కడ చూసినా ఏ దేవాలయాలు చూసినా శ్రావణ మాసం సందడి నెలకొంది. ముఖ్యంగా కన్వర్ యాత్ర మొదలై రహదారులన్నీ భక్తులతో నిండిపోయాయి. హిందువుల ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం హరిద్వార్ లో కన్వర్ యాత్ర జూలై 15 వరకు జరుగుతుంది. ఈ ఏడాది దాదాపు 2 లక్షల మంది భక్తులు పాల్గొంటారని అంచనా. ఈ యాత్రలో పలువురు భక్తులు పాల్గొన్న వీడియోలు ఇప్పటికే వైరల్ అవుతున్నాయి. ఇందులో ఓ యువకుడు కావిడి ఎత్తుకుని వెళ్తున్నాడు. ఆ కావిడి లో ఒక వైపు తన తల్లిని ..మరోవైపు గంగాజలాన్ని భుజాలపై ఎత్తుకుని వెళ్తున్న వీడియో అందరినీ ఆకర్షిస్తోంది.
ఈ వీడియో ఏఎన్ఐ వార్తా సంస్థ 4వ తేదీన ట్వీట్ చేసింది. ఇప్పటివరకు ఈ వీడియోను దాదాపు 62,000 మంది చూశారు. 2,300 మందికి పైగా దీన్ని లైక్ చేశారు. వందలాది మంది రీట్వీట్ చేశారు. నెటిజనులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. హర హర మహాదేవ శంభో శంకర అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Kanwar Yatra 2023: A youth carries his mother on one shoulder and water of the river Ganga on the other shoulder in Haridwar pic.twitter.com/83vuUxVT83
— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 4, 2023
కన్వర్ యాత్ర ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ప్రారంభమైంది. ఇక్కడ గంగాజలాన్ని సేకరించి తమ తమ స్వగ్రామాలలోని శివాలయాలకు సమర్పిస్తారు. ఈ యాత్రకు వచ్చే వారు కాలినడకన వెళతారు. తమ స్వస్థలాలకు.. తిరిగి వెళ్లేటప్పుడు బీహార్‌లోని గౌముఖ్, గంగోత్రి, సుల్తాన్‌గంజ్ వంటి ముఖ్యమైన ప్రదేశాలను సందర్శిస్తారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..