Viral Video: దాహం వేస్తే మృగరాజైనా అల్లాడాల్సిందే.. సింహం దాహాన్ని తీరుస్తున్న యువకుడు.. వీడియో వైరల్

ఈ వీడియోలో ఒక వ్యక్తి అడవికి రాజైన మృగరాజు బాటిల్ లోని నీటిని తాగిస్తున్నాడు. ఆ వ్యక్తి  సింహానికి  భయపడకుండా నిలబడడమే కాదు నీటిని పట్టించాడు. అతని ధైర్యాన్ని అభినందిస్తున్నారు. అయితే సర్వ  సాధారణంగా ప్రజలు సింహాన్ని చూస్తే భయంతో పరుగు పెడతారు.

Viral Video: దాహం వేస్తే మృగరాజైనా అల్లాడాల్సిందే.. సింహం దాహాన్ని తీరుస్తున్న యువకుడు.. వీడియో వైరల్
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Jul 03, 2023 | 11:13 AM

ఆకలి దప్పికలు ప్రతి జీవికి సహజం. ముఖ్యంగా వేసవి కాలంలో ఎండ వేడికి మరింత అధికంగా దాహం వేస్తుంది. ఆషాడ మాసం పూర్తి అయ్యే రోజులు వస్తున్నా ఇంకా వర్షాలు కురవడంలేదు.. ఎండలు మండిస్తూనే ఉన్నాయి. చాలామంది ఇప్పటికీ ఏసీలు, కూలర్ లు వినియోగిస్తూనే ఉన్నారు. ఇప్పటికే బయటకు ఏదైనా పనిమీద వెళ్లాలంటే నిప్పుల కొలిమిలో అడుగు పెడుతున్నట్లే ఫీల్ అవుతున్నారు. అంతేకాదు దాహం తీర్చుకోవడానికి బాటిల్ తో వాటర్ ను తీసుకుని వెళ్తారు. అయితే జంతువులు ఎండ వేడికి దాహం తీర్చుకోవడానికి తాముండే నివాస ప్రాంతాలను కూడా వదిలి జనావాసాల బాట పడుతున్నాయి. నీటి కోసం అక్కడక్కడ తిరుగుతాయి. ప్రస్తుతం దాహంతో తిరుగుతున్న సింహానికి చెందిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన ప్రజలను ఆశ్చర్యపడుతున్నారు.

ఈ వీడియోలో ఒక వ్యక్తి అడవికి రాజైన మృగరాజుకి బాటిల్ లోని నీటిని తాగిస్తున్నాడు. ఆ వ్యక్తి  సింహానికి  భయపడకుండా నిలబడడమే కాదు నీటిని పట్టించాడు. అతని ధైర్యాన్ని అభినందిస్తున్నారు. అయితే సర్వ  సాధారణంగా ప్రజలు సింహాన్ని చూస్తే భయంతో పరుగు పెడతారు. అయితే వైరల్ అవుతున్న వీడియోలో  పొదల వెనుక నుండి ఒక సింహం పరుగెత్తుకుంటూ వచ్చి..  మనిషి దగ్గర ఉన్న వాటర్ బాటిల్‌ని చూసి పరుగు ఆపివేసింది. అప్పుడు ఆ వ్యక్తి స్వయంగా తన చేతులతో నీటిని తాగిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

గూస్ బంప్స్ ను తెప్పిస్తున్న వీడియోను IFS అధికారి సుశాంత్ నందా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘ఈ గ్రహం మీద మ్యాజిక్ అంటూ ఉంటే, అది నీటిలో మాత్రమే ఉంది’ అని క్యాప్షన్‌లో రాశారు. కేవలం 8 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 49 వేలకు పైగా వీక్షించగా, వందలాది మంది వీడియోను లైక్ చేశారు.

అదే సమయంలో, వీడియోను చూసిన తర్వాత నెటిజన్లు విభిన్నంగా కామెంట్ చేశారు. ‘ఇది అద్భుత దృశ్యం’ అని కొందరంటే, నీటిలో నిజంగానే మ్యాజిక్ ఉందని మరికొందరు అంటున్నారు. అదేవిధంగా ‘ప్రభుత్వం అడవిలో గొట్టపు బావి లేదా నీటి తొట్టిని తయారు ఏర్పాటు చేస్తే..  తద్వారా జంతువులకు నీటి కొరత ఉండదు’ అని ఒకరు కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!