వార్నీ ఇదేక్కడి వింత..! కదులుతున్న తులసి మొక్క..చూసేందుకు ఎగబడుతున్న జనం.. ఎక్కడంటే..

ప్రతి ఇంట్లోనూ తులసి మొక్క తప్పక ఉంటుంది. ప్రతిరోజూ తులసిని పూజించిన తర్వాతే మిగతా పనులు ప్రారంభిస్తారు చాలా మంది. ఇంత పవిత్రమైన తులసి మొక్క కుడివైపు తిరగడం ఎప్పుడైనా చూసారా...? వైరల్ అవుతున్న వీడియోలో అలాంటి దృశ్యం కనిపించింది. తులసి మొక్క దానికదే అటూ ఇటూ తిరుగుతున్న దృశ్యం

వార్నీ ఇదేక్కడి వింత..! కదులుతున్న తులసి మొక్క..చూసేందుకు ఎగబడుతున్న జనం.. ఎక్కడంటే..
తులసి మొక్క: తులసి మొక్క వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. ఇంటికి సానుకూలతను పెంచుతుంది. ఇంటి ప్రతికూలత కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. తులసితో పాటు అలోవెరా, అరేకా ప్లాంట్, మనీ ప్లాంట్ వంటి మొక్కలు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి మేలు చేస్తాయి.
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 03, 2023 | 11:42 AM

ఈ ఇంటర్నెట్ యుగంలో మనల్ని నవ్వించే వీడియోలకు కొదవలేదు. ప్రతిరోజూ మనం సోషల్ మీడియాలో ఒకదానికి మించి మరొకటి వింత వీడియోని చూస్తాము. ఇలా కనిపించే దృశ్యాలు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. అవి అసలైనదా…? నకిలీనా..? అనే సందేహంలో ఉండిపోతారు నెటిజన్లు. ఇప్పుడు దానికి మరో వీడియో యాడ్ అయింది. ఇక్కడ ఓ తులసి మొక్కకు సంబంధించిన వీడియో ఇది. హిందూమతంలో తులసికి గౌరవప్రదమైన స్థానం ఉంది. ప్రతి ఇంట్లోనూ తులసి మొక్క తప్పక ఉంటుంది. ప్రతిరోజూ తులసిని పూజించిన తర్వాతే మిగతా పనులు ప్రారంభిస్తారు చాలా మంది. ఇంత పవిత్రమైన తులసి మొక్క కుడివైపు తిరగడం ఎప్పుడైనా చూసారా…? వైరల్ అవుతున్న వీడియోలో అలాంటి దృశ్యం కనిపించింది. తులసి మొక్క దానికదే అటూ ఇటూ తిరుగుతున్న దృశ్యం చూపరులను ఆశ్చర్యపోయేలా చేస్తుంది.

ఈ వైరల్‌ వీడియోలో తులసి మొక్క తిరుగుతున్నట్టుగా ఉంది. ఒక ఎత్తైన చెట్టు అడుగున నాటిన తులసి మొక్క అటు ఇటు తిరుగుతున్నట్లుంది. అది చూసిన మహిళలు ఆశ్చర్యపోవటం, ఉత్సుకతను వ్యక్తం చేయడం వీడియోలో వినిపించింది. తులసి మొక్క దానంతటదే కదులుతోంది..డ్యాన్స్‌ చేస్తోంది.. అంటూ చర్చించుకుంటున్నారు. ఈ వీడియో ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌తో పాటు పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో చక్కర్లు కొడుతోంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో ఎక్కడ, ఎప్పుడు రికార్డైంది అనేది తెలియరాలేదు. కానీ, ఒక్కటి మాత్రం నిజం. ఈ వీడియో వెనుక నిజం తెలియరాలేదు. అయితే ఈ వీడియో ఇప్పుడు నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఇది నెటిజన్లలో కూడా చర్చకు దారితీసింది. దీనికి కీటకాలు కారణమని కొందరు నమ్ముతారు. కొంతమంది ఈ వీడియో ఫేక్ అని కొట్టేపారేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..