Space Destination Wedding: అంతరిక్షంలో పెళ్లి..! మరి విందు వినోదాలు ఎలా ఉంటాయో తెలుసా..?
అంతరిక్షంలో ఎవరు పెళ్లి చేసుకుంటారని మీరు సందేహ పడొచ్చు. కానీ, అంతరిక్షంలో పెళ్లి చేసుకోవటం కోసం అప్పుడే బుక్కింగ్ మొదలైంది. ఈ కార్యక్రమానికి ముందే 1,000 టిక్కెట్లు అమ్ముడయ్యాయి. స్పేస్ వెడ్డింగ్‌ను ఎంజాయ్ చేయటం కోసం జంటలు
పెళ్లి అంటనే హడావుడి, హంగామా..రోజుల తరబడి ప్రిపరేషన్లు ఉంటాయి. కానీ, ఇక్కడ అవేవీ ఉండవు. వివాహ వేడుకకు ఉన్న అవాంతరాలను వదిలించుకుంటే, బహుశా దీని కంటే మెరుగైనది, అద్భుతమైనది మరోకటి ఉండదు. అంతేకాదు.. ఇక్కడ మరో మంచి విషయం ఏమిటంటే.. పెళ్లి అనంతరం ఉండే మిగిలిన ఫంక్షన్లకు మీకు ఓడ కూడా ఇస్తారు. అందులో మీరు హ్యాపీగా పార్టీ చేసుకోవచ్చు. 2024 నాటికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. స్పేస్ పెర్స్పెక్టివ్ కంపెనీ స్పేస్ వెడ్డింగ్‌ను ప్రారంభించింది. కార్బన్ న్యూట్రల్ బెలూన్‌లో కూర్చొని అంతరిక్షం నుండి భూమికి సంబంధించిన అందమైన దృశ్యాలను చూపించడం ద్వారా జంటలను అంతరిక్షానికి తీసుకెళ్లే వరకు కంపెనీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. 6 గంటల స్పేస్‌షిప్ నెప్ట్యూన్ విమాన ప్రయాణం సాగుతుంది. ఈ స్పెస్ డెస్టినేషన్ వెడ్డింగ్ లో అతిథులను 1,00,000 అడుగుల ఎత్తుకు తీసుకెళ్లనున్నారు.
వామ్మో అంత ఎత్తులో, అంతరిక్షంలో ఎవరు పెళ్లి చేసుకుంటారని మీరు సందేహ పడొచ్చు. కానీ, అంతరిక్షంలో పెళ్లి చేసుకోవటం కోసం అప్పుడే బుక్కింగ్ మొదలైంది. ఈ కార్యక్రమానికి ముందే 1,000 టిక్కెట్లు అమ్ముడయ్యాయి. స్పేస్ వెడ్డింగ్‌ను ఎంజాయ్ చేయటం కోసం జంటలు స్పేస్ పెర్స్‌పెక్టివ్ వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా 2024 చివరి నాటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇకపోతే, ఈ అద్భుతమైన పెళ్లి బడ్జెట్ ఎంత ఉంటుంది అనే సందేహం కూడా మీలో కలుగక మానదు. కాబట్టి కంపెనీ ప్రకారం, నెప్ట్యూన్‌లో సీటు కోసం, మీరు 10,283,250 రూపాయలు. ($ 125,000 చెల్లించాలి.)అని సమాచారం.
ఈ స్పేస్‌క్రాఫ్ట్‌లో రిఫ్రెష్‌మెంట్ సౌకర్యం అందుబాటులో ఉంది. ఇది మాత్రమే కాదు, మీకు వై-ఫై, టాయిలెట్, ఫ్లోటింగ్ లాంజ్ వంటి సౌకర్యాలు కూడా లభిస్తాయి.