AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Floating Bridge: చైనాలో ఈ వంతెన ఓ అద్భుతం.. ప్రకృతి అందాలు, నీటిపై తేలియాడుతూ నడిచే కార్లు..

చైనాలోని షిజిగువాన్ ప్రావిన్స్‌లోని లోయలో ప్రవహించే నదిపై నిర్మించిన వంతెన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ వంతెనను మొదటిసారి చూస్తే, ఈ వంతెన నదిపై తేలియాడుతున్నట్లు.. దానిపై వాహనాలు దూసుకుపోతున్నట్లు అనిపిస్తుంది. ఈ వంతెన అద్భుతాలను చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి ఇక్కడికి వస్తుంటారు.

Floating Bridge: చైనాలో ఈ వంతెన ఓ అద్భుతం.. ప్రకృతి అందాలు, నీటిపై తేలియాడుతూ నడిచే కార్లు..
Floating Bridge
Surya Kala
|

Updated on: Jul 03, 2023 | 1:06 PM

Share

ప్రపంచంలో అనేక వింతలు విశేషాలున్న పదేశాలున్నాయి. ప్రకృతి వింతలు చూస్తే అబ్బో అంటూ ఆశ్చర్యంగా చూస్తాం.. అంతేకాదు ఇవి మానవుల సృష్టా.. ప్రకృతి మనిషికి ఇచ్చిన అద్భుతమైన సృష్టా అని ఆలోచిస్తారు. కొన్నింటిని చూస్తే ఇలాంటివి చూడాలంటే అదృష్ట వంతులకే సాధ్యం అని ఆలోచిస్తారు. నేటి కాలంలో ఎంతగానో సైన్స్ అభివృద్ధి చెందింది. సాంకేతికత సహాయంతో మానవులు కూడా ప్రకృతి అందాలను కృతిమంగా సృష్టించగలడు. వీటిని చూసిన జనం ఒకొక్కసారి అయోయమయానికి గురవుతారు.  అలాంటి ఒక అద్భుతం చైనాలో ఉంది. ఇది చూసిన అందరూ షాక్ అవుతున్నారు.

వాస్తవానికి చైనాలోని షిజిగువాన్ ప్రావిన్స్‌లోని లోయలో ప్రవహించే నదిపై నిర్మించిన వంతెన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ వంతెనను మొదటిసారి చూస్తే, ఈ వంతెన నదిపై తేలియాడుతున్నట్లు.. దానిపై వాహనాలు దూసుకుపోతున్నట్లు అనిపిస్తుంది. ఈ వంతెన అద్భుతాలను చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి ఇక్కడికి వస్తుంటారు. నదిలో తేలుతూ ఈ వంతెనపై డ్రైవింగ్ చేస్తూ ఆనందిస్తారు. ఈ వంతెన నదిపై తేలియాడుతున్నట్లు కనిపిస్తుంది..  వంతెన మీద ప్రయాణించే వాహనాలు గాల్లో పరుగెడుతున్నట్లు కనిపిస్తుంది.

చైనాకు నైరుతి దిశలో హుబే ప్రావిన్స్‌లోని జువాన్ కౌంటీలో ఉన్న షిజిగువాన్ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తన అందంతో ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులను ఆకర్షిస్తుంది. పచ్చని చెట్లు, నదితో ప్రకృతి రమణీయ దృశ్యాలతో అలరించే ఈ ప్రదేశం సందర్శించదగినది. అంతేకాదు ఈ వంతెన మీద ప్రయాణం ప్రజలకు అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. దానిపై వెళ్లే వాహనాలు బ్రిడ్జిపై కాకుండా నీటి ఉపరితలంపై కదులుతున్నట్లు కనిపించడంతో పాటు ఈ నది కూడా కదులుతున్నట్లు వాహనంలో కూర్చున్నవారు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ వంతెన 500 మీటర్ల పొడవు మరియు 4.5 మీటర్ల వెడల్పుతో వంకర నదిపై నిర్మించబడింది. ఈ ప్రత్యేకమైన వంతెనను చూడటానికి ప్రతిరోజూ 10 వేల మందికి పైగా పర్యాటకులు ఇక్కడకు వస్తారు. ఈ వంతెన చుట్టూ ఒక అడవి ఉంది. ఇది నది అందాన్ని పెంచుతుంది. నిజంగా మనం చూసినా.. తయారు చేసిన ఇంజనీర్‌కి సెల్యూట్ చేస్తాం.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..