Madonna Health: ప్రాణాంతక వైరస్ బారిన పడిన పాప్ సింగర్ మడోన్నా.. క్షణాల్లో ప్రాణాలు తీసే ఈ బ్యాక్టీరీయా ఎలా సోకుతుంది లక్షణాలు ఏమిటంటే?

మడోన్నాకు సోకిన బ్యాక్టీరియా హానికరం. ఇది చర్మం మీద ఉన్న గాయాల వలన, పురుగులు కరిచినా, లేదా శస్త్రచికిత్స గాయాల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. అంతేకాదు కలుషితమైన ఆహారం తిన్నప్పుడు లేదా శారీరక సంబందంతో, బ్యాక్టీరియా గాలి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు స్ట్రెప్ A, సాల్మొనెల్లా, ఇంపెటిగో వైరస్ లు.. ఉదాహరణలుగా నిలుస్తాయి. 

Madonna Health: ప్రాణాంతక వైరస్ బారిన పడిన పాప్ సింగర్ మడోన్నా.. క్షణాల్లో ప్రాణాలు తీసే ఈ బ్యాక్టీరీయా ఎలా సోకుతుంది లక్షణాలు ఏమిటంటే?
Madonna Health
Follow us
Surya Kala

|

Updated on: Jun 30, 2023 | 10:17 AM

అమెరికాకు చెందిన పాప్ సింగర్ మడోన్నా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ బారిన పడి తీవ్ర అనారోగ్యానికి గురైంది. దీంతో చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు. 64 ఏళ్ల మడోన్నా జూన్ 24, శనివారం న్యూయార్క్‌లో అపస్మారక స్థితికి చేరుకుంది. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. మడోన్నా తీవ్ర బాక్టీరియా ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు మేనేజర్ గై ఓసీరీ తెలిపారు. ఈ కారణంగా జులై 15న జరగాల్సిన మడోన్నా  ప్రపంచ యాత్ర వాయిదా పడింది.

క్రమంగా మడోన్నా ఆరోగ్యం మెరుగుపడుతుందని.. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోందని వైద్య బృందం చెప్పారు. మిచిగాన్‌లో జన్మించిన ఈ సింగర్ కు ఏ బ్యాక్టీరియా సోకిందో ప్రస్తుతానికి స్పష్టంగా తెలియనప్పటికీ..  బ్యాక్టీరియా చాలా ప్రాణాంతకమని.. శరీరంలోని వివిధ భాగాలను ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు. చర్మం, ఊపిరితిత్తులు, రక్తంతో సహా అనేక భాగాలు తీవ్ర ఇన్ఫెక్షన్ కు గురయ్యాయని తెలిపారు.

బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఎలా  సోకుతుందంటే?  మడోన్నాకు సోకిన బ్యాక్టీరియా హానికరం. ఇది చర్మం మీద ఉన్న గాయాల వలన, పురుగులు కరిచినా, లేదా శస్త్రచికిత్స గాయాల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. అంతేకాదు కలుషితమైన ఆహారం తిన్నప్పుడు లేదా శారీరక సంబందంతో, బ్యాక్టీరియా గాలి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు స్ట్రెప్ A, సాల్మొనెల్లా, ఇంపెటిగో వైరస్ లు.. ఉదాహరణలుగా నిలుస్తాయి.

ఇవి కూడా చదవండి

బాక్టీరియ లక్షణాలు 

తీవ్ర జ్వరం, దగ్గు, శ్వాస ఆడకపోవడం, చెమటలు పట్టడంతో పాటు విపరీతమైన చలి. అంతేకాదు  తలనొప్పి, కండరాల నొప్పి, అలసట, ఛాతీ నొప్పి కూడా బ్యాక్టీరియా సంక్రమణ లక్షణాలు కావచ్చు. ఈ లక్షణాలు ఎలా ఎక్కడ నుంచి సంశ్రమించింది అనే విషయంపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు చెవికి  ఇన్ఫెక్షన్ సోకితే చెవి నొప్పి, వినికిడి సమస్యకు కారణమవుతుంది. సాల్మొనెల్లా వైరస్ బారిన పడితే    విరేచనాలు, వాంతులు కలగవచ్చు.

యాంటీబయాటిక్స్ ను ఈ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. వీటిని టాబ్లెట్స్, టానిక్స్, క్రీమ్ లేదా IV రూపంలో ఇవ్వవచ్చు. ఈ మెడిసిన్స్ బ్యాక్టీరియాను చంపుతాయి.. లేదా వాటిని మరింత పెరగకుండా నిరోధించేలా పని చేస్తాయి. అయితే ఈ మందులు ఫ్లూ వంటి వైరస్‌లకు వ్యతిరేకంగా పోరాడే మందులంత శక్తివంతం కావు. చాలా సందర్భాల్లో ఇవి తేలికపాటివి అయితే కొన్ని బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్‌లు ప్రాణాపాయం కలిగిస్తాయి.

సెప్సిస్ ఎందుకు ప్రమాదకరమైనది , ప్రాణాంతకం?

సెప్సిస్ అనేది చాలా ప్రమాదకరమైనది. ఒకొక్కసారి ప్రాణాంతక వ్యాధిగా కూడా మారవచ్చు. శరీరంలో ఏదైనా ఇన్ఫెక్షన్ కారణంగా సంభవిస్తుంది. దీనిని సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు. శరీరంలో ఇన్ఫెక్షన్ సోకినప్పుడు మనుషుల ఆరోగ్యంపై దాడి చేస్తుంది. రోగనిరోధక శక్తిని నిరోధిస్తుంది. శరీర కణజాలాలు, అవయవాలపై ప్రభావం చూపిస్తుంది. ఈ సెప్సిస్‌ను గుర్తించడం చాలా కష్టం.. ఎందుకంటే ఈ వైరస్  లక్షణాలు సర్వసాధారణంగా భావించి నెగ్లెక్ట్ చేస్తారు.

ఈ వైరస్ బారిన పడిన వారి ఆరోగ్యం వేగంగా క్షీనిస్తుంది. బాధితులకు తక్షణ వైద్య సహాయం అవసరం. తక్షణ వైద్య సంరక్షణ అందించకపోతే అవయవాలు వైఫల్యం అయి ఒకొక్కసారి మరణం కూడా సంభవించవచ్చు. కొన్ని గంటల్లోనే ఈ దారుణం జరగవచ్చు.  బ్రిటన్ లో ప్రతి సంవత్సరం సెప్సిస్ వైరస్ బారిన 250,000 మంది పడుతున్నారు. 52,000 మంది మరణిస్తున్నారు.

సెప్సిస్ లక్షణాలు ఏమిటి?

పెద్దవారిలో, కండరాల నొప్పి, తీవ్రమైన శ్వాస ఆడకపోవడం, చర్మం పాలిపోవడం, వణుకు, గందరగోళం , మాటలు ముద్దగా రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాదు ఈ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ శరీర రక్తాన్ని కలుషితం చేసే సెప్టిసిమియా అనే వ్యాధికి దారితీస్తుంది. శరీరం రోగనిరోధక వ్యవస్థ సంక్రమణతో పోరాడలేనప్పుడు ఇది సంభవిస్తుంది. అప్పుడు ఎక్కువ బ్యాక్టీరియా రక్తప్రవాహంలోకి ప్రవేశించేలా చేస్తుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల  కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే