Aspartame: కూల్‌ డ్రింక్స్‌లో వాడే కృత్రిమ తీపితో క్యాన్సర్ ముప్పు.. డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక!

కూల్‌డ్రింక్స్‌ తాగే వాళ్లకు డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక జారీ చేసింది. శీతల పానీయాల్లో వినియోగించే కృత్రిమ తీపి క్యాన్సర్‌కు కారకమవుతుంది. అస్పర్టెమ్‌ అనే నాన్-షుగర్ స్వీటెనర్ అందుకు ప్రధాన కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా అధ్యయనాల్లో..

Aspartame: కూల్‌ డ్రింక్స్‌లో వాడే కృత్రిమ తీపితో క్యాన్సర్ ముప్పు.. డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక!
Aspartame
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 14, 2023 | 12:44 PM

వాషింగ్లన్: కూల్‌డ్రింక్స్‌ తాగే వాళ్లకు డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక జారీ చేసింది. శీతల పానీయాల్లో వినియోగించే కృత్రిమ తీపి క్యాన్సర్‌కు కారకమవుతుంది. అస్పర్టెమ్‌ అనే నాన్-షుగర్ స్వీటెనర్ అందుకు ప్రధాన కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా అధ్యయనాల్లో తేలింది. అస్పర్టమే అనే కృత్రిమ తీపిని ప్రపంచంలో అన్ని దేశాల్లో శీతల పానియాల్లో వినియోగిస్తుంటారు. ఇది తక్కువ కాలరీలు ఉండే కృత్రిమ స్వీటెనర్. ఇది సుక్రోజ్ కంటే సుమారు 200 రెట్లు తియ్యగా ఉంటుంది. దీనివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని అంతర్జాతీయ క్యాన్సర్ పరిశోధన సంస్థ (IARC) జూలైలో ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

కోకా-కోలా, డైట్ సోడాలు, మార్స్ ఎక్స్‌ట్రా చూయింగ్ గమ్, కొన్ని రకాల స్నాపిల్ డ్రింక్స్ వంటి పలు ఉత్పత్తుల్లో అస్పర్టమే వినియోగిస్తుంటారు. అస్పార్టిక్ యాసిడ్, ఫెనిలాలనైన్ అనే రెండు అమైనో ఆమ్లాలతో ఈ స్వీటెనర్‌ను తయారు చేస్తారు. అస్పార్టిక్ ఆమ్లం, ఫెనిలాలనైన్‌తోపాటు కొద్ది మొత్తంలో మిథనాల్ కూడా ఉంటుంది. 1965లో రసాయన శాస్త్రవేత్త జేమ్స్ ఎం ష్లాటర్ అస్పర్టెమ్‌ను కనుగొన్నారు. కార్బోనేటేడ్ పానీయాల్లో తీపి రుచికి ప్రత్యామ్నాయంగా అస్పర్టెమ్‌ను వినియోగించడానికి యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) 1983లో ఆమోదించింది. కూల్‌ డ్రింక్స్‌లో మాత్రమేకాకుండా తృణధాన్యాలు, చక్కెర లేని చూయింగ్ గమ్, తక్కువ కేలరీల పండ్ల రసాలు, డైట్ సోడాలతో సహా పలురకాల ఆహారాలు, పానీయాలలో చక్కెరకు ప్రత్యామ్నాయంగా అస్పర్టమేని ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.