Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్టార్ హీరో విక్రమ్‌ ఏంటి ఇలా మారిపోయాడు..! మరీ ఇంత దారుణంగానా..? వీడియో వైరల్

కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్‌ గురించి తెలియని వారుండరు. విలక్షణ నటనతో ప్రతి సినిమాలో తనదైనా ప్రత్యేక అభిరుచిని కనబరుస్తుంటాడు విక్రమ్‌. అందుకోసం ఎంతటి కఠినమైన స్టంట్స్‌ చేయడానికైనా వెనుకాడడు. తన పాత్రకు తగ్గట్టు ఎప్పటికప్పుడు రెడీ..

స్టార్ హీరో విక్రమ్‌ ఏంటి ఇలా మారిపోయాడు..! మరీ ఇంత దారుణంగానా..? వీడియో వైరల్
Chiyaan Vikram
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 29, 2023 | 8:37 AM

కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్‌ గురించి తెలియనివారుండరు. విలక్షణ నటనతో ప్రతి సినిమాలో తనదైనా ప్రత్యేక అభిరుచిని కనబరుస్తుంటాడు విక్రమ్‌. అందుకోసం ఎంతటి కఠినమైన స్టంట్స్‌ చేయడానికైనా వెనుకాడడు. తన పాత్రకు తగ్గట్టు ఎప్పటికప్పుడు రెడీ అయిపోతుంటాడు. శరీరాకృతి నుంచి బరువు వరకు ప్రతిదీ ఎంతో నిబద్ధతతో చేస్తుంటాడు. కథలో తన పాత్రకు నూటికి నూరుపాళ్లు న్యాయం చేసేందుకు ఎంతటి రిస్క్ అయినా హీరో విక్రమ్ అస్సలు వెనకడుగువేయడు.

ఈ ఏడాది పొన్నియిన్ సెల్వన్ 2 చిత్రంతో మంచి విజయం అందుకున్న విక్రమ్, తాజాగా తంగలాన్ మువీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేళ్‌ రాజా నిర్మిస్తున్నారు. రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. తంగలాన్‌ కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ (కేజీఎఫ్‌)లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ మువీని తెరకెక్కిస్తున్నారు. మాళవికా మోహనన్‌, పార్వతి తిరువొత్తు కథానాయకులుగా నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ మువీ షూటింగ్‌లో ఇటీవల విక్రమ్‌కు ప్రమాదం జరిగిన విషయం తెల్సిందే. దీంతో షూటింగ్‌కు కాస్త గ్యాప్ ఇచ్చాడు. విరామం తర్వాత మళ్లీ సెట్స్‌లో అడుగుపెట్టాడు. విక్రమ్ షూటింగ్ సెట్‌లో పాల్గొన్న వీడియోను విక్రమ్‌ తాజాగా తన ట్విటర్‌ ఖాతాలో షేర్ చేశాడు. ఈ వీడియోలో విక్రమ్‌ గెటప్‌ అస్సలు గుర్తుపట్టలేనంతగా విచిత్రంగా ఉంది. బక్కచిక్కి పోయిన పలుచటి శరీరం, పొడవైన జుట్టు, బట్టతల, ఒంటికి చిన్న గుడ్డ మాత్రమే కట్టుకొని నల్లని ఛాయతో చూసేందుకు భయంకరంగా ఉన్నాడు. ఈ మువీలో విక్రమ్‌ గెటప్‌ చూసి అభిమానులు షాకవుతున్నారు. ఎంత స్టైలిష్‌గా ఉండే హీరోను.. ఎలా మార్చేశారు భయ్యా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి.