AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జగిత్యాల జిల్లాలో ఘోర ఘటన.. చెవి కమ్మల కోసం బావమరిదిని హత్య చేసిన బావ

భార్యకు అనారోగ్యంగా ఉండటంతో చెల్లెలి కమ్మలు తాకట్టు పెట్టి..  ఆ డబ్బుతో భార్యకు వైద్యం చేయించాడో వ్యక్తి. ఆ విషయం తెలుసుకున్న చెల్లెలి భర్త బావమరిదిని ఘోరంగా చావబాది హతమార్చాడు. ఈ విషాద ఘటన..

జగిత్యాల జిల్లాలో ఘోర ఘటన.. చెవి కమ్మల కోసం బావమరిదిని హత్య చేసిన బావ
Ear Rings
Srilakshmi C
|

Updated on: Jun 28, 2023 | 10:14 AM

Share

జగిత్యాల: భార్యకు అనారోగ్యంగా ఉండటంతో చెల్లెలి కమ్మలు తాకట్టు పెట్టి..  ఆ డబ్బుతో భార్యకు వైద్యం చేయించాడో వ్యక్తి. ఆ విషయం తెలుసుకున్న చెల్లెలి భర్త బావమరిదిని ఘోరంగా చావబాది హతమార్చాడు. ఈ విషాద ఘటన జగిత్యాల జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. జగిత్యాల టౌన్‌ ఎస్సై అబ్దుల్‌ రహీం తెలిపిన వివరాల ప్రకారం..

జగిత్యాల జిల్లా మిషన్‌ కంపౌండ్‌ ప్రాంతానికి చెందిన శివరాత్రి రమేశ్‌ (28) భార్య శైలజ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలో భార్యకు వైద్యం చేయించేందుకు చెల్లెలి అనుమతితో ఆమె కమ్మలు తాకట్లు పెట్టి వచ్చిన డబ్బుతో భార్యకు చికిత్స చేయించాడు. ఈ విషయం తెలుసుకున్న రమేశ్‌ బావ నాగదరి యాకుబ్‌ తన భార్య చెవికమ్మలు వెంటనే తిరిగివ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయమై సోమవారం రాత్రి (జూన్‌ 26) యాకుబ్‌కు, అతని బావమరిది రమేష్‌ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

కోపోధ్రిక్తుడైన యాకుబ్ రమేశ్‌పై విచక్షణా రహితంగా దాడి చేసి చావబాదాడు. దీంతో రమేష్‌ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు గమనించి వెంటనే బాధితుడిని జగిత్యాల జిల్లా దవాఖానకు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. రమేశ్‌ భార్య శైలజ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై అబ్దుల్‌ రహీం తెలిపాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్.. రాత్రికి రాత్రే కనిపించకుండా..
ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్.. రాత్రికి రాత్రే కనిపించకుండా..
మనుషులుగా మారే పాములు ఉన్నాయా?..స్నేక్ ఎక్స్‌పర్ట్ ఏమంటున్నారంటే
మనుషులుగా మారే పాములు ఉన్నాయా?..స్నేక్ ఎక్స్‌పర్ట్ ఏమంటున్నారంటే
IPL 2027: ధోనీతో పాటు మరో ఇద్దరు ఆటగాళ్లకు చెన్నై గుడ్ బై..?
IPL 2027: ధోనీతో పాటు మరో ఇద్దరు ఆటగాళ్లకు చెన్నై గుడ్ బై..?
ముంచుకొస్తున్న నైరుతి రుతుపవనాలు.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు..
ముంచుకొస్తున్న నైరుతి రుతుపవనాలు.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు..
ఒంటికి చలువ చేసే అదిరిపోయే ఈవెనింగ్ స్నాక్స్.. తోటకూర పకోడీ..
ఒంటికి చలువ చేసే అదిరిపోయే ఈవెనింగ్ స్నాక్స్.. తోటకూర పకోడీ..
మీకో సవాల్.. ఈ చిత్రంలో ఉన్న నెంబర్‌ను కనిపెడితే.. మీరే తోపులు!
మీకో సవాల్.. ఈ చిత్రంలో ఉన్న నెంబర్‌ను కనిపెడితే.. మీరే తోపులు!
బట్టల మురికి వదలట్లేదా?.. వాషింగ్ మెషీన్‌లో ఇదొక్కటి కలపండి!
బట్టల మురికి వదలట్లేదా?.. వాషింగ్ మెషీన్‌లో ఇదొక్కటి కలపండి!
మీ కెరీర్‌లో గ్రోత్ లేదా?.. మీరు చేసే ఈ చిన్న తప్పే కారణం
మీ కెరీర్‌లో గ్రోత్ లేదా?.. మీరు చేసే ఈ చిన్న తప్పే కారణం
పూజ చేస్తూ మనసు ఇతర విషయాలపైకి వెళ్తే అది పాపమా? ప్రేమానంద్ జీ...
పూజ చేస్తూ మనసు ఇతర విషయాలపైకి వెళ్తే అది పాపమా? ప్రేమానంద్ జీ...
ఒక్క మ్యాచ్ ఆడకుండా ధోనీ ఎంత జీతం తీసుకున్నాడో తెలుసా..?
ఒక్క మ్యాచ్ ఆడకుండా ధోనీ ఎంత జీతం తీసుకున్నాడో తెలుసా..?