AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జబర్దస్త్‌ కమెడియన్‌ విడాకులంటూ సోషల్ మీడియాలో రూమర్స్..? ఇంతకీ అసలు విషయమేమంటే..

బుల్లితెర కమెడియన్ యాదమ్మరాజు- స్టెల్లా రాజ్‌ విడాకులకు సిద్ధమయ్యారంటూ నెట్టింట వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. పెళ్లై ఏడాది తిరక్కుండానే అప్పుడే విడాకులేంటీ.. అంటూ పలువురు ఆరా తీస్తున్నారు. జబర్దస్త్ కామెడీ షోలో కడుపుబ్బా నవ్వించే..

జబర్దస్త్‌ కమెడియన్‌ విడాకులంటూ సోషల్ మీడియాలో రూమర్స్..? ఇంతకీ అసలు విషయమేమంటే..
Yadama Raju, Stella
Follow us
Srilakshmi C

| Edited By: Ravi Kiran

Updated on: Jun 28, 2023 | 1:48 PM

బుల్లితెర కమెడియన్ యాదమరాజు- స్టెల్లా రాజ్‌ విడాకులకు సిద్ధమయ్యారంటూ నెట్టింట వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. పెళ్లై ఏడాది తిరక్కుండానే అప్పుడే విడాకులేంటీ.. అంటూ పలువురు ఆరా తీస్తున్నారు. జబర్దస్త్ కామెడీ షోలో కడుపుబ్బా నవ్వించే యాదమరాజు, అతని భార్య స్టెల్లా గతేడాది పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక స్టెల్లా కూడా భర్తపేరుతో ఓ యూట్యూబ్ ఛానెల్‌ను ఓపెన్ చేసింది. పలు షోలు, ఈవెంట్స్ చేస్తూ బిజీగా ఉంది. ఈ మధ్యనే ఓ డ్యాన్స్ షోకు హాజరైన ఈ జంట తాము విడాకులు తీసుకోబోతున్నట్లు తెలిపి అందరికీ షాకిచ్చారు. ఐతే ఇది నిజంగా కాదట ఊత్తిత్తిగా అట. ఇంతకీ విషయమేమంటే..

బుల్లితెర కామెడీ షోలో ప్రతి వారం ఓ వెరైటీ థీమ్‌తో ప్రేక్షకుల ముందుకొస్తుంటారు కమెడియన్లు. దీనిలో భాగంగా ఈ వారం యాదమ్మ రాజు, స్టెల్లా విడాకులు తీసుకోవడానికి రెడీ అయినట్లు ఓ స్కిట్‌ వేస్తున్నారు. విడాకుల థీమ్‌తో ఈ జంట కనిపించనున్నారు. ‘నీతో నావల్ల కావడం లేదు. నాకు విడాకులు కావాలి’ అని స్టెల్లా అడుగుతుంది. ఆ విడాకులు కూడా ఓ ఫంక్షన్‌లా జరగాలని చెబుతుంది. తాజాగా విడుదలైన కామెడీ షో ప్రోమోలో ఈ మేరకు కనిపించారు. దీంతో ఇదంతా ప్రమోషన్స్ స్టంట్ అని తెలిసి ప్రేక్షకులు కన్నెర్ర చేస్తున్నారు. ఇదేం పైత్యం.. కొత్తగా పెళ్లైన జంట విడాకులు తీసుకోవడం ఏంటీ.. అంతకు మించి వేరే ఆలోచలేం లేవా? అంటూ విమర్శిస్తున్నారు. ప్రమోషన్స్ కోసం కలపడం, విడదీయడం వీళ్లకు కొత్తేంకాదులే అంటూ మండిపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.