Hyderabad: భగ్గుమంటున్న కూరగాయల ధరలు.. దిగివచ్చేదెన్నడు? టమాటా రూ.120, అల్లం రూ.300, మిర్చి రూ.160..

రాష్ట్రంలో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. నెలరోజుల క్రితం వంద రూపాయలకు 4 కిలోల చొప్పున అమ్మిన టమాటాల ధర ప్రస్తుతం కిలో రూ.120 చేరింది. హైదరాబాద్‌తోపాటు అన్ని ప్రాంతాల్లోని రిటైల్‌ మార్కెట్లలో ఇదే పరిస్థితి..

Hyderabad: భగ్గుమంటున్న కూరగాయల ధరలు.. దిగివచ్చేదెన్నడు? టమాటా రూ.120, అల్లం రూ.300, మిర్చి రూ.160..
Vegetable Prices
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 28, 2023 | 12:17 PM

హైదరాబాద్‌: రాష్ట్రంలో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. నెలరోజుల క్రితం వంద రూపాయలకు 4 కిలోల చొప్పున అమ్మిన టమాటాల ధర ప్రస్తుతం కిలో రూ.100 చేరింది. హైదరాబాద్‌తోపాటు అన్ని ప్రాంతాల్లోని రిటైల్‌ మార్కెట్లలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. టమాట ధరకు పోటీపడుతూ పచ్చిమిర్చి ధర పైపైకి ఎగబాకుతోంది. పచ్చిమిర్చి కిలో రూ.120 నుంచి 160 వరకు పలుకుతోంది. బీన్స్ కిలో 120 నుంచి రూ.160 వరకు ఉండగా, చిక్కుడు కాయలు కిలో రూ.80 నుంచి రూ.100ల వరకు విక్రయిస్తున్నారు. ఇక అల్లం ఆల్‌టైం రికార్డు ధరకి చేరుకుంది. కిలో ఏకంగా రూ.300లు పెరిగింది. వెల్లుల్లి కిలో రూ.240లకు విక్రయిస్తున్నారు.

బెండకాయలు, బీరకాయలు, దొండకాయలు ఇలా కూరగాయల ధరలు కిలో రూ.60 నుంచి 80 వరకు పెరిగాయి. రైతుబజార్లలో పరిస్థితి కొంతమెరుగ్గా ఉన్నప్పటికీ రిటైల్‌ దుకాణాల్లో ధరలు మండిపోతున్నాయి. రిటైల్‌ మార్కెట్ల కన్నా సూపర్‌మార్కెట్లలో కిలోకు రూ.10 నుంచి 15 వరకు అధికంగా ఉండటం గమనార్హం. కూరగాయల ధరలు సామాన్యుడికి అందనంతగా పెరిగిపోవడంతో ఆందోళన చెందుతున్నారు.

వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా మూడునెలలుగా రాష్ట్రంలో కూరగాయల పంటలు ఆశించిన స్థాయిలో రైతులు పండించడం లేదు. దీంతో ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌లో అకాల వర్షాలు రైతులను కుదిపేశాయి. ఇక మే, జూన్‌లలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా టమాటా, పచ్చిమిర్చి, వంకాయ, బెండకాయ వంటి కూరగాయల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు, క్యారెట్‌ ధరలు మాత్రం కాస్త ఊరట కలిగించేలా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

రెండు వారాల్లో సాధారణ స్థితికి ధరలు

ఒక్క హైదరాబాద్‌లోనే కాకుండా ప్రస్తుతం దేశంలోని చాలా చోట్ల టమాటా సెంచరీ దాటేసింది. సాధారణ పరిస్థితి ఎప్పుడొస్తుందా అని సామాన్యుడు ఆందోళన చెందుతున్నాడు. కూరగాయల రేట్ల పెరుగుదలపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్‌ కుమార్‌ స్పందించారు. కూరగాయగాల ధరలు పది, పదిహేను రోజుల్లో ధరలు సాధారణ స్థితికి చేరుకుంటాయన్నారు. దిగుమతి చేసుకున్న టమాటో ఇతర ప్రాంతాలకు చేరుకోవడానికి రెండు వారాలకు మించి ఉండదు. పదిహేను రోజుల తర్వాత పరిస్థితి మామూలుగా ఉంటుందని, ధరలు కచ్చితంగా దిగొస్తాయని ఆయన అన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్