AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naga Shaurya: ఆ గొడవలో అమ్మాయిదే తప్పు.. అసలు విషయం చెప్పిన నాగ శౌర్య

అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారాడు. ఛలో సినిమా తర్వాత నాగ శౌర్య ఆ రేంజ్ హిట్ అందుకోలేకపోయారు. దాంతో ఈసారి ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలని కసిమీద ఉన్నాడు.

Naga Shaurya: ఆ గొడవలో అమ్మాయిదే తప్పు.. అసలు విషయం చెప్పిన నాగ శౌర్య
Naga Shourya
Rajeev Rayala
|

Updated on: Jun 28, 2023 | 9:08 AM

Share

టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతోన్న యంగ్ హీరోల్లో నాగ శౌర్య ఒకరు. ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోగా పరిచయం అయిన ఈ యంగ్ టాలెంట్.. ఆ తర్వాత ఛలో సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారాడు. ఛలో సినిమా తర్వాత నాగ శౌర్య ఆ రేంజ్ హిట్ అందుకోలేకపోయారు. దాంతో ఈసారి ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలని కసిమీద ఉన్నాడు. ఈ ఈక్రమంలోనే ఇప్పుడు రంగబలి అనే సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యాడు. ఇదిలా ఉంటే ఒకానొకసారి ఇద్దరు లవర్స్ రోడ్డుమీద కొట్టుకుంటుంటే కారు ఆపి దిగివచ్చి ఆ అబ్బాయికి వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.. అప్పట్లో ఈ వీడియో సంచలనం గా మారింది. ఇద్దరు ప్రేమికులు గొడవపడుతుంటే నాగ శౌర్య ఆపే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే అమ్మాయి మీద చేయి చేసుకున్న ఆ యువకుడితో వాగ్వాదానికి దిగాడు. దీని పై తాజాగా మరోసారి స్పందించాడు నాగశౌర్య.

రంగబలి ,మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో అప్పటి ఇండీసెంట్ గురిని మాట్లాడుతూ.. ఆ గొడవలో తప్పంతా ఆ అమ్మాయిదే అన్నారు. పనిమీద కూకట్ పల్లి వెళ్తుండగా ఓ అబ్బాయి అమ్మాయిని కొడుతూ కనిపించాడు. వెంటనే అక్కడికి వెళ్లి ఎందుకు అమ్మాయిని కొడుతున్నావ్ సారి చెప్పు అని అడిగాను.. కానీ అమ్మాయి..

నా బాయ్ ఫ్రెండ్ నన్ను కొడుతాడు.. చంపుతాడు నీకెందుకు అంది. అమ్మాయిలే అలా అంటే ఇంకేం చెప్తాము. కానీ నేను ఒక్కటే చెప్తా అలా మిమ్మల్ని కొట్టేవాడిని అస్సలు పెళ్లి చేసుకోవద్దు.. దాని వల్ల మీకు, మీకుటుంబంకు మంచిది కాదు. మీ జీవితంలో ఎవరిని నమ్మాలి? ఎవరిని నమ్మకూడదు? అనే విషయాన్ని ఆలోచించుకోవాలి అని చెప్పుకొచ్చారు నాగ శౌర్య.

తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!