Maya Bazar OTT : ఓటీటీలో దగ్గుబాటి రానా, నవదీప్, ఈషారెబ్బాల ‘మాయా బజార్’ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీల్లో కూడా తన అదృష్టం పరీక్షించుకుంటోది ఈషా. ఆమె కీలక పాత్రలో నటిస్తోన్న వెబ్ సిరీస్ మాయా బజార్. ఫర్ సేల్ అనేది ట్యాగ్‌లైన్. నవదీప్, హరితేజ, నరేష్ విజయ్ కుమార్, ఝాన్సీ లక్ష్మీ, కోట శ్రీనివాసరావు, మియాంగ్ చంగ్, సునైన కీలక పాత్రలు పోషిస్తున్నారు.
‘అంతకుముందు.. ఆ తర్వాత’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ఈషా రెబ్బ. మొదటి సినిమాలోనే అందం, అభినయంతో ఆకట్టుకుందీ తెలుగమ్మాయి. ఆ తర్వాత బందిపోటు, అమితుమి, దర్శకుడు, బ్రాండ్‌బాబు, అరవింద సమేత వీర రాఘవ, సుబ్రహ్మణ్యపురం, సవ్యసాచి, రాగల 24 గంటల్లో, పిట్ట కథలు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైందీ. ఇప్పుడు ఓటీటీల్లో కూడా తన అదృష్టం పరీక్షించుకుంటోది ఈషా. ఆమె కీలక పాత్రలో నటిస్తోన్న వెబ్ సిరీస్ మాయా బజార్. ఫర్ సేల్ అనేది ట్యాగ్‌లైన్. నవదీప్, హరితేజ, నరేష్ విజయ్ కుమార్, ఝాన్సీ లక్ష్మీ, కోట శ్రీనివాసరావు, మియాంగ్ చంగ్, సునైన కీలక పాత్రలు పోషిస్తున్నారు. దగ్గుబాటి రానా ‘స్పిరిట్ మీడియా బ్యానర్’ తో కలిసి రాజీవ్ రంజన్ ఈ సిరీస్‌ను నిర్మించారు. గౌతమి చల్లగుల్ల రైటర్ కమ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న మాయా బజార్ స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ 5 లో జులై 14 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.
కాగా ఒక గేటెడ్ కమ్యూనిటీలోని కుటుంబాలకు సంబంధించిన కథతో మాయాబజార్ తెరకెక్కింది. గేటెడ్ కమ్యూనిటీని అనధికార కట్టడంగా గుర్తించిన ప్రభుత్వం దానిని కూల్చేయాలని నిర్ణయిస్తుంది. ఇందుకోసం బుల్డోజర్లు కూడా వస్తాయి. మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది తెలుసుకోవాలంటే మాయా బజార్ వెబ్ సిరీస్ చూడాలంటున్నారు మేకర్స్.
Meet Kausalya, our four-legged resident and an integral part of Pastry’s kutumbam! Moo-ing into Maya Bazaar, and taking everyone for a ride.. join the ride from 14th July, on Zee5. #MayabazaarOnZee5 #MayabazaarForSale #PainaPataramLonaLotaram @pnavdeep26 @followgautami pic.twitter.com/bEfHhVWnen
— ZEE5 Telugu (@ZEE5Telugu) June 27, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..