Jawan: బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ జవాన్ మూవీ ఆ రెండు భాషల్లో మాత్రమేనా..
జీరో సినిమా తర్వాత షారుక్ నటించిన ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఇక ఈ సినిమా తర్వాత ఇప్పుడు తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారు షారుక్. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తుంది.
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ రీసెంట్ గా పఠాన్ సినిమాతో భారీ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాతో షారుక్ చాలా కాలం తర్వాత సాలిడ్ హిట్ అందుకున్నారు. జీరో సినిమా తర్వాత షారుక్ నటించిన ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఇక ఈ సినిమా తర్వాత ఇప్పుడు తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారు షారుక్. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు జవాన్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్.. గ్లింమ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
ఇక ఈ సినిమాను కూడా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు అట్లీ. ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన రకరకాల వార్తలు బీ టౌన్ లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయనున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ ప్రమోషన్స్ హిందీ. తమిళ్ లో గట్టిగానే జరుగుతున్నాయి. షారుక్ హిందీ హీరో అవ్వడం.. దర్శకుడు అట్లీ తమిళ్ డైరెక్టర్ కావడంతో ఈ రెండు భాషల్లో జవాన్ మూవీకి మంచి బజ్ క్రియేట్ అయ్యింది. తెలుగులో మాత్రం అంతగా ప్రమోట్ చేయడం లేదు. తెలుగులో ఎలాంటి ప్రమోషన్ లేకుండా పఠాన్ సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టింది. మరి జవాన్ సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్స్ వసూల్ చేస్తుందో చూడాలి.