Robo: సూపర్ స్టార్ రోబో సినిమాను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా.. ఆయన చేసుంటే

ఈ సినిమాలో రజినీకాంత్ డ్యూయల్ రోల్ లో కనిపించి అలరించారు. ఇక ఈ మూవీలో అందాల తార ఐశ్వర్య రాయ్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలు గ్రాఫిక్స్ ప్రేక్షకులను కట్టిపడేసింది. 2010లో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది

Robo: సూపర్ స్టార్ రోబో సినిమాను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా.. ఆయన చేసుంటే
Robo
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 29, 2023 | 9:22 AM

సినీ ఇండస్ట్రీలో టాప్ దర్శకుడిగా రాణిస్తున్న వారిలో శంకర్ ఒకరు. శంకర్ తెరకెక్కించిన సినిమాల్లో రోబో ఒకటి. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఇక ఈ సినిమాలో రజినీకాంత్ డ్యూయల్ రోల్ లో కనిపించి అలరించారు. ఇక ఈ మూవీలో అందాల తార ఐశ్వర్య రాయ్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలు గ్రాఫిక్స్ ప్రేక్షకులను కట్టిపడేసింది. 2010లో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది అలాగే ఈ సినిమాలో రజినీకాంత్ రోబోగా నటించి ఆకట్టుకున్నారు. ఈ మూవీకి సీక్వెల్ కూడా వచ్చింది. అయితే ఈ సినిమాను ఓ స్టార్ హీరో మిస్ చేసుకున్నాడట. సూపర్ స్టార్ కంటే ముందు ఈ సినిమాను మరో హీరోతో చేయాలనుకున్నాడట దర్శకుడు శంకర్. ఆ హీరో ఎవరంటే..

రోబో సినిమాను మిస్ చేసుకున్న హీరో మరెవరో కాదు కమల్ హాసన్. శంకర్ ఈ మూవీని ముందుగా కమల్ తో చేయాలనుకున్నారట. కానీ అది వీలు పడలేదు. ఇతర సినిమాలతో కమల్ బిజీగా ఉండటంతో రోబో సినిమా ను కమల్ మిస్ చేసుకున్నారట.

ప్రస్తుతం కమల్ హాసన్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. రీసెంట్ గా ఆయన ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కే సినిమాలో కీలక పాత్రలో నటించనున్నారు. ఇటీవలే ఈ మూవీ మేకర్స్ అద్దికారిక ప్రకటన చేశారు. అలాగే శంకర్ దర్శకత్వంలో భారతీయుడు 2 సినిమా చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరిగుతోంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.