AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు.. ఈ రూట్లలో వాహనాల రాకపోకలు బంద్‌!

బక్రీద్‌ సందర్భంగా గురువారం (జూన్‌ 29న) నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేయనున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని పాత నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు..

Hyderabad: రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు.. ఈ రూట్లలో వాహనాల రాకపోకలు బంద్‌!
Traffic Restrictions
Srilakshmi C
|

Updated on: Jun 28, 2023 | 9:15 AM

Share

హైదరాబాద్‌: బక్రీద్‌ సందర్భంగా గురువారం (జూన్‌ 29న) నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేయనున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని పాత నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. గురువారం ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు మీరాలం ట్యాంక్‌ ఈద్గా ప్రాంతంలో ట్రాఫిక్‌ ఆంక్షల కారణంగా ఆ రూట్లలో వచ్చే వాహనాలను రూట్లకు మళ్లిస్తారు. ప్రార్థనలు నిర్వహించే ఆయా సమయాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.

ఏయే రూట్లలో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయంటే..

  • బహదూర్‌పురా ఎక్స్‌ రోడ్డు మీదుగా ఉదయం 8 నుంచి 11.30 గంటల మధ్య పురానాపూల్‌, కామాటిపురా, కిషన్‌బాగ్‌ వైపు నుంచి ఈద్గాకు ప్రార్థనల కోసం వచ్చే వారిని అనుమతిస్తారు.
  • జూ పార్కు, మసీద్‌ అల్హా హో అక్బర్‌ ఎదురుగా వాహనాలను పార్కు చేయవల్సి ఉంటుంది. దీంతో ఈద్గా రోడ్డు వైపు వాహనాలకు అనుమతి ఉండదు.
  • ఆ రూట్లలోని ట్రాఫిక్‌ను బహదూర్‌పురా ఎక్స్‌ రోడ్డు వద్ద కిషన్‌బాగ్‌, కామాటిపూరా, పురానాపూల్‌ వైపు మళ్లిస్తారు.
  • శివరాంపల్లి, ధనమ్మ హట్స్‌ వైపు నుంచి ప్రార్థనల కోసం వచ్చే అన్ని వాహనాలను ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు ధనమ్మ హట్స్‌ రోడ్డు నుంచి అనుమతిస్తారు. ఈ రూట్లలోని ట్రాఫిక్‌కు ఈద్గా వైపు అనుమతిలేదు. ధనమ్మ హట్స్‌ క్రాస్‌రోడ్స్‌ నుంచి శాస్త్రిపురం, ఎన్‌ఎస్‌కుంట రూట్లలో ఆ వాహనాలను మళ్లిస్తారు.
  • పురానాపూల్‌ నుంచి బహదూర్‌పురా వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలను ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు పురానాపూల్‌ దర్వాజ వద్ద జియాగూడ, సిటీ కాలేజీ వైపు మళ్లిస్తారు.
  • ఈ సమయాల్లో శంషాబాద్‌, రాజేంద్రనగర్‌ వైపు నుంచి బహదూర్‌పురా వైపు వచ్చే వాహనాలను అరాంఘర్‌ జంక్షన్‌ నుంచి మళ్లిస్తారు.
  • కాలాపత్తర్‌ నుంచి ఈద్గాకు వచ్చే వాహనాలను కాలాపత్తర్‌ ఠాణా, మోచీ కాలనీ, బహదూర్‌పురా వైపు మళ్లిస్తారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్