AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asin Divorce Rumours: స్టార్‌ హీరోయిన్‌ అసిన్‌ విడాకులు తీసుకోబోతున్నట్లు నెట్టింట చర్చ..! ఒక్క పోస్టుతో క్లారిటీ..

సెలబ్రెటీల ప్రేమలు, పెళ్లిళ్లు మూణ్ణాళ్ల ముచ్చటగా ఉంటాయి. ప్రేమ పెళ్లి విడాకులు వెంటవెంటనే జరిగిపోవడం షరా మామూలైపోయింది. ఈ మధ్య స్థార్ కపుల్‌ విడాకులకు ముందు తమ సోషల్‌ మీడియా ఖాతాల్లో పెళ్లి ఫొటోలు డిలీట్‌ చేయడం ద్వారా..

Asin Divorce Rumours: స్టార్‌ హీరోయిన్‌ అసిన్‌ విడాకులు తీసుకోబోతున్నట్లు నెట్టింట చర్చ..! ఒక్క పోస్టుతో క్లారిటీ..
Asin And Rahul Sharma
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 28, 2023 | 1:44 PM

సెలబ్రెటీల ప్రేమలు, పెళ్లిళ్లు మూణ్ణాళ్ల ముచ్చటగా ఉంటున్నాయి. ప్రస్తుత రోజుల్లో ప్రేమ పెళ్లి విడాకులు వెంటవెంటనే జరిగిపోవడం షరా మామూలైపోయింది. ఈ మధ్య స్థార్ కపుల్స్ విడాకులకు ముందు తమ సోషల్‌ మీడియా ఖాతాల్లో పెళ్లి ఫొటోలు డిలీట్‌ చేయడం ద్వారా ముందస్తు ఇన్ఫర్మేషన్‌ ఇస్తున్నారు. తాజాగా స్టార్‌ హీరోయిన్‌ అసిన్‌ కూడా తన భర్త రాహుల్ శర్మకు త్వరలో విడాకులు ఇవ్వబోతున్నట్లు నెట్టింట వార్తలు గుప్పుమన్నాయి. అసిన్‌ తన ఇస్టా ఖాతా నుంచి భర్తతో ఉన్న ఫొటోలు డిలిట్‌ చేయడమే అందుకు కారణం. పెళ్లి ఫొటోలను కూడా తొలగించింది. దీంతో అసిన్‌ తన భర్తకు విడాకులు ఇవ్వబోతుందనే అనుమానం అభిమానులకు కలిగింది. ఈ వార్త ఆనోటా ఈనోటా పడి వైరల్‌గా మారింది. దీనిపై నటి అసిన్ ఒక్క పోస్టుతో క్లారిటీ ఇచ్చింది.

‘మేము విడిపోతున్నామనే వార్తలు సోషల్‌ మీడియాలో కనిపించాయి. అవి చూడగానే మా కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్న నాటి రోజులు గుర్తుకొచ్చాయి.  సీరియస్లీ..? ఇంకొంచెం బెటర్‌గా ప్లాన్‌ చేయండి. న్యూసెన్స్ క్రియెట్‌ చేసే ఇలాంటి అవాస్తవాలు సృష్టించడం దయచేసి ఆపండంటూ’ గట్టిగానే ఇచ్చిపడేసింది నటి అసిన్‌.

ఇవి కూడా చదవండి

కాగా నటి అసిన్‌ మైక్రోమ్యాక్స్ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మతో వివాహమైన తర్వాత యాక్టింగ్‌కు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అసిన్‌, రాహుల్‌ జంటకు ఐదేళ్ల కుమార్తె అరిన్ కూడా ఉంది. నిజానికి అసిన్‌ తన ఇన్‌స్టా ఖాతా సడెన్‌గా ఇలా పోస్టులను తొలగించడం తొలిసారేం కాదు. అసిన్‌ గత ఫిబ్రవరిలోనే తన ఇన్‌స్టా ఖాతా నుంచి తన పెళ్లి ఫొటోలను తొలగించింది. గతంలో తన పేరెంట్స్ వివాహ వార్షికోత్సవ ఫొటోలను ఇలాగే హఠాత్తుగా తొలగించింది. శ్రీదేవి మరణించిన తర్వాత ఆమె పోస్ట్‌లను కూడా తొలగించింది.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.