UPSC Civils Free Coaching: ఓయూ క్యాంపస్‌లో సివిల్స్ ఉచిత కోచింగ్‌కు దరఖాస్తులు.. మొత్తం 150 సీట్లు
యూపీఎస్సీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్, మెయిన్ పరీక్షలకు ఉచిత కోచింగ్ ఉచ్చేందుకు ఉస్మానియా యూనివర్సిటీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది..
హైదరాబాద్: యూపీఎస్సీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్, మెయిన్ పరీక్షలకు ఉచిత కోచింగ్ ఉచ్చేందుకు ఉస్మానియా యూనివర్సిటీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. బీసీ నిరుద్యోగ అభ్యర్థులకు జూలై 31 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 30వ తేదీ వరకు ఓయూ క్యాంపస్‌లో లాంగ్ టర్మ్ కోచింగ్ ఉచిత కోచింగ్ ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించి 150 మందిని ఎంపిక చేయనున్నారు. తొలి 50 మందిని మెరిట్ ప్రాతిపదికన ఎంపిక చేస్తారు. మరో 100 మందిని స్క్రీనింగ్ పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నట్లు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జి ఆశన్న తెలిపారు. అందుకు జూలై 16న స్కీనింగ్ పరీక్ష నిర్వహించనున్నారు.
సివిల్స్ ఉచిత శిక్షణకు ఎంపికైన వారికి వసతి, భోజన సదుపాయం, రవాణా ప్రయోజనాల కోసం నెలకు రూ.5,000 చెల్లిస్తారు. అలాగే ఉచిత శిక్షణకు ఎంపికైన అభ్యర్థులకు రూ.5,000 విలువైన పుస్తకాలు, స్టడీ మెటీరియల్ అందిస్తారు. అంతేకాకుండా లైబ్రరీ సౌకర్యం కూడా ఉంటుంది. ఈ అవకాశాన్ని నిరుద్యోగ అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో అధికారిక వెబ్‌సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పూర్తి వివరాల కోసం ఫోన్ నం: 040-24071178 కు ఫోన్ చేసి సంప్రదించాలన్నారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.