AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia Ukraine War: యుద్ధంలో హనుమంతుడు మమ్మల్ని రక్షిస్తాడు.. గీతాసారం ప్రకారం జెలెక్సీ కి శిక్ష తప్పదంటున్న రష్యా కమాండర్

రష్యా. పొరుగుదేశమైన ఉక్రెయిన్‌లో చేస్తున్న యుద్ధం కేవలం భూభాగంకోసం చేస్తున్న యుద్ధం కాదు.  రష్యా తన మనుగడకు చేరుస్తున్న పోరాటం. అయితే ఈ యుద్దానికి ముగింపు ఎంత కాలం అంటే..  నాటో, రష్యా బలగాలు పరస్పరం ఘర్షణకు దిగనంత వరకు అని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే మరోవైపు నాటో దేశాలు ఉపయోగిస్తున్న F-16 ఫైటర్ జెట్‌ను ఉక్రెయిన్ కు మరికొన్ని రోజుల్లో చేరనున్నాయి.

Russia Ukraine War: యుద్ధంలో హనుమంతుడు మమ్మల్ని రక్షిస్తాడు.. గీతాసారం ప్రకారం జెలెక్సీ కి శిక్ష తప్పదంటున్న రష్యా కమాండర్
Russia Ukraine War
Surya Kala
|

Updated on: Jun 27, 2023 | 11:14 AM

Share

రష్యా.. ఉక్రెయిన్ యుద్ధం మొదలై దాదాపు ఏడాదిన్నర అయినా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధంలో ఇరుదేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నాయి. రష్యా యుద్ధంలో కొంత సంపాదించింద అదే సమయంలో దానినే కోల్పోయింది. యుద్ధానికి కేంద్ర బిందువైన ఉక్రెయిన్‌కు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇరుదేశాల మధ్య జరుగుతున్న యుద్ధంతో ప్రపంచం కూడా చాలా నష్టపోయింది. 24 ఫిబ్రవరి 2022న ప్రారంభమైన యుద్ధంలో ఉక్రెయిన్ అనేక భూభాగాలను కోల్పోయింది. క్షిపణి ఎటువైపు నుంచి తమ భూ భాగంపై పడుతుందో అని అక్కడ ప్రజలు క్షణ క్షణం భయపడుతూ బతుకుతున్నారు. ఉక్రెయిన్‌లోని అనేక నగరాల రష్యా ఆధీనంలోకి వెళ్లాయి.

అయితే వాగ్నర్ గ్రూప్ రష్యాలో తిరుగుబాటు బావుటా ఎగురవేసింది. ఈ యుద్ధంలో వాగ్నర్ రష్యాకు భారీ విజయాన్ని అందించాడని అంటున్నారు. వాస్తవానికి అమెరికా, యూరప్ దృష్టిలో వాగ్నర్ గ్రూప్ ఉగ్రవాద సంస్థ.

రష్యా ఎందుకు యుద్ధం చేస్తుందంటే..  రష్యా. పొరుగుదేశమైన ఉక్రెయిన్‌లో చేస్తున్న యుద్ధం కేవలం భూభాగంకోసం చేస్తున్న యుద్ధం కాదు.  రష్యా తన మనుగడకు చేరుస్తున్న పోరాటం. అయితే ఈ యుద్దానికి ముగింపు ఎంత కాలం అంటే..  నాటో, రష్యా బలగాలు పరస్పరం ఘర్షణకు దిగనంత వరకు అని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే మరోవైపు నాటో దేశాలు ఉపయోగిస్తున్న F-16 ఫైటర్ జెట్‌ను ఉక్రెయిన్ కు మరికొన్ని రోజుల్లో చేరనున్నాయి. అప్పుడు యుద్ధం రూపు మార్పు తీసుకోవచ్చని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

రష్యన్ కమాండర్ కు హిందూ ధర్మంపై విశ్వాసం.. భుజాలపై గణేష్-హనుమాన్ పచ్చబొట్లు రష్యా మిలటరీ కమాండర్‌ కొన్ని రోజులు భారతదేశంలో నివసించాడు. కమాండర్ కు హిందూ ధర్మం పట్ల విశ్వాసం లభించింది. అతను తన భుజాలపై హనుమంతుడు, గణేషుని పచ్చబొట్టు వేయించుకున్నాడు. అంతేకాదు తన చేతులపై ఓం నమః శివాయ టాటూలను కూడా వేయించుకున్నాడు. బాలీవుడ్ సినిమాలు కూడా చూస్తుంటాడు. రష్యాలో మిథున్ చక్రవర్తి చాలా ఫేమస్. రష్యా కమాండర్లకు గోమాతపై అత్యంత విశ్వాసం ఉంది.

కమాండర్ తల్లి ఆవుని ఉదాహరణగా చెప్పి తన సైనికులలో ఉత్సాహాన్ని నింపుతాడు. Zelensky గురించి అడిగినప్పుడు రష్యన్ కమాండర్ భగవద్గీత గురించి చెప్పాడు. చెడు పనులకు శిక్ష గురించి గీతలో వ్రాసినట్లుగా.. Zelensky తన చెడు పనుల ఫలితాన్ని కూడా పొందుతాడు. యుద్ధంలో హనుమంతుడు తనను కాపాడాడని రష్యా కమాండర్ చెప్పాడు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..