AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Research: తాబేళ్లపై పరిశోధనల్లో సంచలన విషయాలు వెల్లడి.. పిల్లల లింగ నిర్ధారణకు ఉష్ణోగ్రతతో సంబంధం

శాస్త్రవేత్తల ప్రకారం.. అధికంగా ఉష్ణోగ్రత ఉంటే స్త్రీలో పునరుత్పత్తికి మరింత అనుకూలంగా ఉంటుంది. ఆమెలో సంతానోత్పత్తి శక్తిని పెంచుతుంది. అయితే లైంగిక అభివృద్ధి ఉష్ణోగ్రతపై ఎందుకు ఆధారపడి ఉంటుందో మరింతగా పరిశోధించాలని వెల్లడిస్తున్నారు. 

New Research: తాబేళ్లపై పరిశోధనల్లో సంచలన విషయాలు వెల్లడి.. పిల్లల లింగ నిర్ధారణకు ఉష్ణోగ్రతతో సంబంధం
eggs become female hatchlings
Surya Kala
|

Updated on: Jun 27, 2023 | 12:29 PM

Share

సైన్స్ మానవ మేధస్సుకు పదును పెడుతూ సృష్టికి ప్రతి సృష్టి చేయాలని గత కొంతకాలంగా ప్రయత్నిస్తూనే ఉంది. ఇప్పటికే కృతిమ అవయవాలతో సరికొత్త జీవితాన్ని ఇస్తున్నారు.. తాజాగా పుట్టబోయే బిడ్డ లింగాన్ని నిర్ధారించే విషయంపై సరికొత్త వాదన తెరపైకి వచ్చింది. డ్యూక్ యూనివర్శిటీలో లింగ నిర్ధారణపై చేసిన పరిశోధనలో కడుపులో పెరుగుతున్న పిల్లల లింగం వేడి ఉష్ణోగ్రత ద్వారా నిర్ణయించబడుతుందని వెల్లడైంది. తాబేళ్లపై చేసిన ప్రయోగంలో అనేక విషయాలు వెల్లడయ్యాయి. ఈ పరిశోధన ప్రకారం స్త్రీ లో అండం ఉత్పత్తి సామర్థ్యం అత్యధిక ఉష్ణోగ్రతలో పెరుగుతుందని తెలుస్తోంది.

ఈ ఆవిష్కరణ చాలా ముఖ్యమైనదిగా చెబుతున్నారు. శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని తాబేళ్లపై మాత్రమే కాదు ఇతర జాతుల జంతువులపై కూడా చేశారు. షాకింగ్‌ ఫలితాలు వెలువడ్డాయి. ఈ పరిశోధనల్లో స్త్రీ లింగాన్ని నిర్ధారించేది అధిక ఉష్ణోగ్రత అని వెల్లడైంది.

ఉష్ణోగ్రత లింగ నిర్ధారణను ఎలా నిర్ణయిస్తుందట?  పరిశోధకుల అభిప్రాయం ప్రకారం అధిక ఉష్ణోగ్రతలు పిండం-బేరింగ్ స్పెర్మ్ కణాల సంఖ్య వేగంగా పెరగడానికి దారితీస్తాయి. బీజ కణాలు వేడి వలన స్త్రీగా మారే ప్రక్రియ మొదలవుతుందని వెల్లడయింది.

ఇవి కూడా చదవండి

డ్యూక్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో సెల్ బయాలజీ ప్రొఫెసర్ రచయిత బ్లాంచే కాపెల్ ప్రకారం.. ఉష్ణోగ్రత అనేది లింగ నిర్ధారణకు ఒక మెకానిజం వంటిది. అధిక ఉష్ణోగ్రత క్యాస్కేడింగ్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది  పిండంలోని అనేక కణాల ద్వారా లింగ నిర్ధారణను వరుసగా ప్రభావితం చేస్తుంది.

గర్భంలో స్త్రీ లింగం ఎలా ఏర్పడుతుందంటే?

లింగ నిర్ధారణ పరిశోధనకు నాయకత్వం వహించిన పరిశోధకుడు బోరిస్ తేజాక్ ప్రకారం.. స్త్రీ , పురుషాంగం అనేది సమృద్ధిగా ఉన్నస్పెర్మ్ కణాల నుండి ఏర్పడుతుంది. లింగ నిర్ధారణ మాత్రమే కాదు..  లైంగిక అభివృద్ధి కూడా ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే తమ పరిశోధన మరింతగా జరగాల్సి ఉంటుందని అప్పుడే స్పష్టంగా తెలుస్తుందని చెప్పారు. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. వాతావరణం, వాతావరణ మార్పుల విషయంలో ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోవడం ముఖ్యం.

శాస్త్రవేత్తల ప్రకారం.. అధికంగా ఉష్ణోగ్రత ఉంటే స్త్రీలో పునరుత్పత్తికి మరింత అనుకూలంగా ఉంటుంది. ఆమెలో సంతానోత్పత్తి శక్తిని పెంచుతుంది. అయితే లైంగిక అభివృద్ధి ఉష్ణోగ్రతపై ఎందుకు ఆధారపడి ఉంటుందో మరింతగా పరిశోధించాలని వెల్లడిస్తున్నారు.

గ్లోబల్ వార్మింగ్ ప్రభావం ఎలా ఉంటుందంటే.. 

అయితే రోజు రోజుకీ భూమి వేడెక్కుతుంది.. దీంతో గ్లోబల్ వార్మింగ్ ప్రమాదం పెరుగుతోంది. తాబేలు వంటి జాతులపై దీని ప్రభావం ఎంత మేరకు ఉంటుందో.. సంతానోత్పత్తి దానంతట అదే పెరుగుతుందా? వంటి అనేక విషయాలపై పరిశోధన చేయాలని పరిశోధకులు చెబుతున్నారు.

శాస్త్రవేత్త ప్రకారం.. కాంతి, వేడి కారణంగా అండం లోపల పిండం అభివృద్ధి చెందుతుంది. ఈ ప్రయోగంలో కొన్ని గుడ్లను 33.5 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఉంచారు. అయితే వెలువడిన ఫలితాలు చాలా షాకింగ్ గా ఉన్నాయని రెండు తలల పిండాలున్నాయని అంటున్నారు.

మొసలి, చేపలపై కూడా ప్రయోగాలు.. తాబేళ్లతో పాటు, డ్యూక్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మొసళ్లు, చేపలపై కూడా ఈ రకమైన ప్రయోగం చేశారు. విశేషమేమిటంటే.. తాబేళ్లలో వలెనే చేపల్లో ఇలాంటి ఫలితాలు కనిపించాయి. అయితే మొసళ్ళలో కొన్ని విభిన్న ఫలితాలు కనిపించాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..