Airlifts Jumbo: 20 ఏళ్ల క్రితం శ్రీలంకకు థాయి ఏనుగు గిఫ్ట్‌.. సరిగ్గా చూడడంలేదంటూ తిరిగి స్వదేశానికి తీసుకుని వెళ్లిన థాయిలాండ్

థాయ్ అధికారులు 2001లో 29 ఏళ్ల ముత్తు రాజా అనే ఏనుగును శ్రీలంకకు  గిఫ్ట్ గా ఇచ్చారు. అయితే గత ఏడాది కాలంగా ఈ ఏనుగుని పట్టించుకోవడం లేదని.. నిర్లక్ష్యంగా  వదిలేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఏనుగుని చిత్రహింసలకు గురి చేస్తున్నారనే ఆరోపణలు వినిపించిన తర్వాత థాయిలాండ్  ప్రభుత్వం తమ ఏనుగుని స్వదేశానికి అప్పగించమంటూ డిమాండ్ చేసింది.

Airlifts Jumbo: 20 ఏళ్ల క్రితం శ్రీలంకకు థాయి ఏనుగు గిఫ్ట్‌.. సరిగ్గా చూడడంలేదంటూ తిరిగి స్వదేశానికి తీసుకుని వెళ్లిన థాయిలాండ్
Airlifts Jumbo
Follow us
Surya Kala

|

Updated on: Jul 03, 2023 | 1:42 PM

శ్రీలంకకు 20 ఏళ్ల క్రితం థాయిలాండ్ ఒక ఏనుగుని బహుమతిగా ఇచ్చారు. ఇపుడు ఆ ఏనుగు తిరిగి స్వదేశానికి పయనం అయింది. ఇప్పటికే శ్రీలంకకు నుంచి థాయ్ ఏనుగును విమానంలో స్వదేశానికి తరలించారు. దౌత్యపరమైన వివాదం కారణంగా.. ఈ థాయి ఏనుగును థాయ్‌లాండ్‌కు తిరిగి పంపించినట్లు తెలుస్తోంది. థాయ్ అధికారులు 2001లో 29 ఏళ్ల ముత్తు రాజా అనే ఏనుగును శ్రీలంకకు  గిఫ్ట్ గా ఇచ్చారు. అయితే గత ఏడాది కాలంగా ఈ ఏనుగుని పట్టించుకోవడం లేదని.. నిర్లక్ష్యంగా  వదిలేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఏనుగుని చిత్రహింసలకు గురి చేస్తున్నారనే ఆరోపణలు వినిపించిన తర్వాత థాయిలాండ్  ప్రభుత్వం తమ ఏనుగుని స్వదేశానికి అప్పగించమంటూ డిమాండ్ చేసింది.

కొలంబోలోని జంతుప్రదర్శనశాలలో తాత్కాలిక నివాసంలో ఉన్న ముత్తురాజాను తెల్లవారుజామున ప్రత్యేకంగా రూపొందించిన ఉక్కు పంజరానికి తరలించారు. విమానంలో నలుగురు థాయ్ హ్యాండ్లర్లు, ఒక శ్రీలంక కీపర్ కూడా ఏనుగుతో పాటు ఉన్నారు. రెండు CCTV కెమెరాలు రవాణా సమయంలో ఏనుగు ఆరోగ్యాన్ని పర్యవేక్షించాయి.

శరీరంపై మచ్చలు దేహివాలా జూ పశువైద్యాధికారి మదుషా పెరెరా ప్రకారం.. గత సంవత్సరం ముత్తురాజా శరీరం కురుపులతో నిండిపోయి ఉందని.. అప్పుడు తీవ్ర మైన నొప్పిని అనుభవించాడని చెప్పారు. ఈ గాయల్లో కొన్ని ఏనుగుని సంరక్షించే హ్యాండర్ల వలన అయ్యాయని చెప్పినా పట్టించుకోలేదంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఏనుగు ఆరోగ్య పరిస్థితిపై జంతు సంక్షేమ సంఘాలు ఆందోళన కూడా చేశాయి.

ఇవి కూడా చదవండి

ప్రాసిక్యూట్ చేయాలని డిమాండ్ థాయ్‌లాండ్‌కు చేరుకున్న ఏనుగు ముందు ఎడమ కాలికి మిగిలిన గాయానికి చికిత్స చేయనున్నారు. ఇందుకు హైడ్రోథెరపీని ఉపయోగించనున్నారు. వాస్తవానికి శ్రీలంకలో ఏనుగులు పవిత్రమైన జంతువులుగా చూస్తారు. వీటికి రక్షించడానికి అనేక చట్టాలు కూడా ఉన్నాయి. యానిమల్ రైట్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (RARE) అనే సంస్థ ఆలయం నుండి ముత్తురాజా ను రక్షించాలని ప్రచారం చేసింది. అంతేకాదు ఇప్పుడు ఈ భారీ ఏనుగులు దేశం వదిలి వెళ్లిపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏనుగుని ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసినందుకు బాధ్యులను ప్రాసిక్యూట్ చేయాలని డిమాండ్ చేస్తోంది.

కొలంబోలోని థాయ్ ఎంబసీ వెలుపల ప్రదర్శన శ్రీలంకలోని ఒక జాతీయవాద బృందం కొలంబోలోని థాయ్ రాయబార కార్యాలయం వెలుపల ప్రదర్శన చేశారు. అంతేకాదు ఏనుగును వచ్చే ఆరు నెలల పాటు శ్రీలంకలో ఉండాలని డిమాండ్ చేసింది. అయితే ఏనుగును తిరిగి తమ దేశానికీ ఇవ్వమని థాయ్‌లాండ్ డిమాండ్ చేసిందని… అదే మాటపై గట్టిగా నిలబడిందని వన్యప్రాణి మంత్రి పవిత్ర వన్నియారాచ్చి తెలిపారు. థాయ్ పర్యావరణ మంత్రి వరవుట్ శిల్పా-అర్చా ముత్తురాజా ఆరోగ్యం గురించి ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. థాయ్ ప్రభుత్వం ఏనుగులను విదేశాలకు రవాణా చేయడంపై నిషేధాజ్ఞలున్నాయి. గతంలో విదేశాలకు పంపిన ఏనుగుల పరిస్థితిని బ్యాంకాక్‌లోని దౌత్య మిషన్ పర్యవేక్షిస్తోంది.

మరిన్నిఅంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ కిక్ చేయండి..