AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాకిస్తాన్‌లో రహస్యంగా పర్యటించిన చైనీస్ బిలియనీర్.. జాక్ మా టూర్‌పై నోరు విప్పని పాక్..

Jack Ma Pakistan Visit: జాక్ మాతో పాటు ఏడుగురు వ్యాపారవేత్తల ప్రతినిధి బృందం పాకిస్తాన్‌ తిరిగింది. వారు ఎందుకు పాక్ పర్యటన చేశారు.. ఏదైన వ్యాపారం కోసం ప్లాన్ చేస్తున్నారా.. దీని వెనుక ఏదైన చైనా కుట్ర ఉందా అనేది ఇంతవరకు తెలియదు. జాక్ మా తోపాటు మరికొందరు చైనా వ్యాపారులు ఉండటం ఈ అనుమానాలకు కారణంగా మారుతున్నాయి. ఇందులో ఐదుగురు చైనా జాతీయులు, ఒక డానిష్ వ్యక్తి, ఒక అమెరికన్ జాతీయుడు ఉన్నట్లుగా సామాచారం.

పాకిస్తాన్‌లో రహస్యంగా పర్యటించిన చైనీస్ బిలియనీర్.. జాక్ మా టూర్‌పై నోరు విప్పని పాక్..
Jack Ma
Sanjay Kasula
|

Updated on: Jul 03, 2023 | 1:54 PM

Share

చైనీస్ బిలియనీర్, అలీబాబా గ్రూప్ సహ వ్యవస్థాపకుడు జాక్ మా  పాకిస్థాన్‌లో రహస్యంగా పర్యటించారు. దీంతో పాక్‌లో ఏం జరుగుతుందన్న అంశంపై చర్చ జరుగుతోంది. ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ అందించిన సమాచారం ప్రకారం జాక్ మా అక్కడి ప్రముఖులు నిర్ధారించారు. జాక్ మా గత నెల చివర్లో లాహోర్‌లో పర్యటించినట్లుగా తెలిపారు. కొన్ని గంటలు కాకుండా మొత్తం  23 గంటలపాటు పాకిస్తాన్‌లోనే బస చేసినట్లుగా తెలిపారు. ఈ పర్యటనలో జాక్ మా వెంట పాక్ ప్రభుత్వ పెద్దలు, అధికారులు కూడా ఉన్నట్లుగా సమాచారం. జాక్ మా పర్యటన వివరాలను చాలా రహస్యంగా ఉంచింది పాకిస్తాన్.. అయితే రాబోయే రోజుల్లో జాక్ మా పర్యటన సానుకూల ఫలితాలు ఇవ్వవచ్చని అంచనాలు వేస్తోంది పాక్ ప్రభుత్వం.  జాక్ మాతో పాటు మరో ఏడుగురు బిజినెస్ హెడ్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. వీరిలో ఐదుగురు చైనా జాతీయులు, ఒక డానిష్ వ్యక్తి, ఒక అమెరికన్ జాతీయుడు ఉన్నారని ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్  తెలిపింది.

అయితే, జాక్ మా నేరుగా పాక్ వెళ్లకుండా ముందుగా హాంకాంగ్‌లోని బిజినెస్ చార్టర్డ్ విమానంలో నేపాల్‌కు వెళ్లి.. అక్కడి నుంచి పాకిస్తాన్ చేరుకున్నారు. పాక్ వ్యాపార అవకాశాల కోసం సెర్చ్ చేసినట్లుగా తెలుస్తోంది. జాక్ మా, అతని బృందంపై ఇప్పటికే  నెట్టింట్లో కరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. జాక్ మా పాక్ బిజినెస్ సెంటర్‌ను సందర్శించి తిరిగి ఎక్కడికి వెళ్లింది తెలియదు.

జాక్ మా పర్యటనలో కొందరు పాక్ బిజినెస్ దిగ్గజాలు సమావేశం నిర్వహించారు. అయితే, ఎలాంటి ఒప్పందాలు అయినట్లుగా  నిర్ధారణ కాలేదు. జాక్ మా పర్యటన పూర్తిగా వ్యక్తిగతం అని పాక్ ప్రముఖులు సోషల్ మీడియాలో తెలిరు. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. జాక్ మా పర్యటన వివరాలు చైనాకు తెలియకపోవడం.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం