అయితే తాము సముద్రంలో రిలీజ్ చేయాలనుకుంటున్న నీటిని శుద్ధి చేస్తామని అప్పుడే సముద్రంలోకి రిలీజ్ చేస్తామని జపాన్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే నీరు హైడ్రోజన్ ఐసోటోప్‌లతో కలుషితమైందని, అది సముద్రపు ఉప్పు, షెల్ఫిష్ వంటి వాటిలోకి చేరుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఐసోటోప్‌లను తొలగించడం ద్వారా నీటిని శుద్ధి చేస్తున్నట్లు జపాన్ పేర్కొంది. CNBC నివేదిక ప్రకారం ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ బ్రెంట్ హుస్సర్ ఈ నీటిలో చాలా తక్కువ మొత్తంలో ట్రిటియం ఉందని... ఇది హానికరం కాదని పేర్కొన్నారు.