ప్రాణాలను పణంగా పెట్టి ప్రమాదకర రైలు ప్రయాణం అవసరమా…భయంకర దృశ్యం.. వీడియో వైరల్..

ఈ దృశ్యం ఎంతో భయానకంగా ఉంది. అతడు ఎక్కడ పడిపోతాడో అని చూపరులు భయపడుతున్నారు. ఈ ప్రమాదకరమైన దృశ్యాన్ని ప్లాట్‌ఫారమ్‌పై ఉన్న ఎవరో తమ సెల్‌ఫోన్‌ కెమెరాతో రికార్డ్‌ చేయగా,.. వీడియో వైరల్‌గా మారింది.

ప్రాణాలను పణంగా పెట్టి ప్రమాదకర రైలు ప్రయాణం అవసరమా...భయంకర దృశ్యం.. వీడియో వైరల్..
Risk
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 03, 2023 | 1:46 PM

చాలా మంది ప్రజలు, ముఖ్యంగా అబ్బాయిలు ప్రయాణిస్తున్నప్పుడు బస్సులు, రైళ్ల తలుపులకు వేలాడుతూ తమ ప్రాణాలను ప్రమాదంలో పెడుతుంటారు. ముఖ్యంగా బస్సులు, రైళ్లు వంటి ప్రజా రవాణాలో ఈ తరహా స్టంట్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. వైరల్‌ వీడియోలో ఒక వ్యక్తి.. రైలు ఎక్కేందుకు విపరీతంగా ప్రయత్నించాడు. కానీ, ఆ ట్రైన్‌లో కాలు పెట్టేందుకు కూడా సందుదొరకటం లేదు.. ఈ దృశ్యం ఎంతో భయానకంగా ఉంది. అతడు ఎక్కడ పడిపోతాడో అని చూపరులు భయపడుతున్నారు. ఈ ప్రమాదకరమైన దృశ్యాన్ని ప్లాట్‌ఫారమ్‌పై ఉన్న ఎవరో తమ సెల్‌ఫోన్‌ కెమెరాతో రికార్డ్‌ చేయగా,.. వీడియో వైరల్‌గా మారింది. ఇది ముంబై లోకల్ ట్రైన్‌లో కనిపించిన దృశ్యం అని తెలిసింది. వీడియో చూసిన చాలా మంది స్పందించారు. ఇలాంటి ప్రయాణాలు చేస్తూ.. ప్రజలు తమ ప్రాణాలతో చెలగాటమాడొద్దని అభ్యర్థించారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ భయానీ పేజీ ద్వారా వీడియోను షేర్‌ చేశారు. ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది వీక్షించారు. ముంబై లోకల్ రైళ్లలో ప్రతిరోజూ ఇదే పరిస్థితి కనిపిస్తుంటుంది. ఈ రైలులో ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణిస్తున్నారు. కానీ, అలా ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణం చేయడం ఎంత వరకు సముచితం. కానీ, ఈ వీడియోలో రైలు ఇప్పటికే కిక్కిరిసి ఉంది. రైలు డోర్‌లో కనీసం కాలు పెట్టేందుకు కూడా స్థలం లేదు. కానీ, చాలా మంది రైలు డోర్‌ వద్దే వేలాడుతున్నారు. వారిలో ఓ యువకుడు మరింత ప్రమాదకరంగా కనిపిస్తున్నాడు. చేతుల్తో పట్టుకోవటానికి లేదు, కాలు పెట్టి నిలబడటానికి కూడా జాగా లేదు..అయినా గానీ, చిన్న ఆసరా మీదే అతడు ప్రమాదకర ప్రయాణం చేస్తున్నాడు. కాస్త కాలు జారినా, చేయి పట్టు జారినా ప్రాణాలకు ముప్పు వాటిల్లడం గ్యారెంటీ.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ఇది చాలా ప్రమాదకరమంటూ వ్యాఖ్యనించారు. ఈ వీడియో చూస్తే హార్ట్‌ బీట్‌ వేగం పెరిగిపోతుంది. తనకు ఏమీ కావొద్దు అంటూ మరొకరు కామెంట్‌ చేశారు. ఇది సామాన్యుడి దైనందిన జీవితం అని మరొకరు వ్యాఖ్యానించారు. రైలు వేగం పెరగడంతో నా గుండె వేగం కూడా పెరుగుతోందని మరొకరు వ్యాఖ్యానించారు. నీ గురించి ఆలోచించకున్నా పర్వాలేదు.. కనీసం నీ కుటుంబం గురించి అయినా ఆలోచించు అని మరొకరు వ్యాఖ్యానించారు.నీ ప్రాణాలను ఎందుకు పణంగా పెడుతున్నారు, ఇలా చేయకండి, మీ కోసం ఇంట్లో మీ కుటుంబం ఎదురుచూస్తోందని, వారి గురించి ఆలోచించండి అంటూ మరొకరు వ్యాఖ్యానించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

హైదరాబాద్ అల్లు ఆర్మీ ఉత్సాహం.! పుష్ప వైల్డ్ ఫైర్ జాతర
హైదరాబాద్ అల్లు ఆర్మీ ఉత్సాహం.! పుష్ప వైల్డ్ ఫైర్ జాతర
ఏడాదిలో ఒక్కసారే దొరికే లడ్డూ.! ఇప్పడు మిస్‌ అయితే మళ్లీ ఏడాదికే!
ఏడాదిలో ఒక్కసారే దొరికే లడ్డూ.! ఇప్పడు మిస్‌ అయితే మళ్లీ ఏడాదికే!
గొంతులో ఏదైనా ఇరుక్కుంటే ఎలా తీయాలి.? నీలోఫర్ వైద్యుల డెమో..
గొంతులో ఏదైనా ఇరుక్కుంటే ఎలా తీయాలి.? నీలోఫర్ వైద్యుల డెమో..
ఇలాంటి స్వీట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.! నోరూరిస్తున్న స్వీట్స్‌.
ఇలాంటి స్వీట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.! నోరూరిస్తున్న స్వీట్స్‌.
నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా