టమాటా తింటే కిడ్నీలో రాళ్లు పెరుగుతాయా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

మీరు ఆరోగ్యంగా ఉండి, కిడ్నీ సమస్య లేకుంటే, టమోటాలు తినడానికి భయపడకండి. కానీ, మీకు కిడ్నీ సంబంధిత సమస్య ఉంటే మీరు ఆక్సలేట్ తీసుకోవడం పరిమితం చేయాలని గుర్తుంచుకోండి. బచ్చలికూర, బీన్స్, బీట్‌రూట్‌లో కూడా అధిక మొత్తంలో ఆక్సలేట్లు ఉంటాయి. ఇంకా..

టమాటా తింటే కిడ్నీలో రాళ్లు పెరుగుతాయా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Tomato
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 01, 2023 | 10:04 PM

ప్రతి వంటలోనూ టమాటాది ముఖ్యపాత్ర. టమాటాలు లేకుండా ఏ వంట పూర్తికాదని చెప్పాలి. టమాలు వంటకు రుచిని మాత్రమే కాకుండా, రంగు, చిక్కదనాన్ని కూడా అందిస్తాయి. మనమందరం టమాటాను కూరగాయగా ఉపయోగిస్తాము. కానీ, ఇది నిజానికి పండ్ల కుటుంబానికి చెందినది. మీరు టమాటాలను తినడం వల్ల చాలా ప్రయోజనాలను ఉంటాయని వినే ఉంటారు. టమాటాలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు, అలాగే అనేక సౌందర్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. టమాటాలతో కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. టమాటా తింటే కిడ్నీలో రాళ్ల సమస్యలు వస్తాయని చాలా మంది భయపడుతున్నారు. నిజంగానే టమాటాలతో కిడ్నీలో రాయి వస్తుందా? దాని గురించి తెలుసుకుందాం.

టమాటాలో విటమిన్ సి, విటమిన్ ఎ, పొటాషియం, ఫైబర్, ప్రొటీన్లు పుష్కలంగా ఉన్నాయి. ఈ రెడ్ సిట్రిక్ ఫ్రూట్ కంటిచూపుకు మేలు చేస్తుంది. డయాబెటిక్ సమస్యలను తగ్గిస్తుంది. సూర్యరశ్మి నుండి రక్షిస్తుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇన్ని లాభాలు ఉన్నా టమాటాతో రిస్క్ ఎలా వస్తుంది.? అనే సందేహం కలుగుతుంది కదూ..! టమాటాల గురించి ఒక సాధారణ నమ్మకం ఏమిటంటే అవి మూత్రపిండాల్లో రాళ్లను కలిగిస్తాయి. కిడ్నీ స్టోన్స్‌లో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో చాలా సాధారణమైనవి కాల్షియం స్టోన్స్. మన కిడ్నీలో కాల్షియం ఆక్సలేట్ అధికంగా చేరడం వల్ల ఈ రాళ్లు ఏర్పడతాయి. ఆక్సలేట్ అనేది వివిధ కూరగాయలు, పండ్లలో సహజంగా లభించే పదార్థం. మన కాలేయం రోజుకు కొంత మొత్తంలో కాల్షియంను ఉత్పత్తి చేస్తుంది. మన ఎముకలు, కండరాలు రక్తం నుండి కాల్షియంను గ్రహిస్తాయి. అయితే రక్తంలో ఈ పోషకం మొత్తం పెరిగినప్పుడు, అది మూత్రంలో విసర్జించబడటానికి మూత్రపిండాలకు వెళుతుంది.

చాలా సార్లు మూత్రపిండాలు శరీరం నుండి అదనపు కాల్షియంను తొలగించలేవు. ఇది క్రమంగా పేరుకుపోతుంది. అదే రాళ్లుగా రూపాంతరం చెందుతుంది. టమాటాలో అధిక మొత్తంలో ఆక్సలేట్ ఉన్నందున టమాటాతో కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉందని భావిస్తారు. టమాటాను డైట్‌లో చేర్చుకోవాలనుకుంటే కిడ్నీలో రాళ్లు వస్తాయని భయపడితే మాత్రం తినకూడదు. టమాటాలో ఆక్సలేట్ ఉంటుంది. కానీ, దాని పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్లను కలిగించదు. 100 గ్రాముల టమాటాలో 5 గ్రాముల ఆక్సలేట్ మాత్రమే ఉంటుంది. టమాటాలు చాలా హానికరమైతే, కిడ్నీలో రాళ్లతో బాధపడేవారు వాటిని పూర్తిగా తీసుకోవడం మానేయమని సలహా ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మీరు ఆరోగ్యంగా ఉండి, కిడ్నీ సమస్య లేకుంటే, టమోటాలు తినడానికి భయపడకండి. కానీ, మీకు కిడ్నీ సంబంధిత సమస్య ఉంటే మీరు ఆక్సలేట్ తీసుకోవడం పరిమితం చేయాలని గుర్తుంచుకోండి. బచ్చలికూర, బీన్స్, బీట్‌రూట్‌లో కూడా అధిక మొత్తంలో ఆక్సలేట్లు ఉంటాయి. కాబట్టి తినడానికి ముందు ఈ కూరగాయలను బాగా ఉడికించాలి.

టమాటాలో ఉండే ప్రధాన యాంటీ ఆక్సిడెంట్‌ను లైకోపీన్ అంటారు. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం అవసరం. మధుమేహం, స్థూలకాయం, అధిక రక్తపోటు, కాలుష్యం, ఇన్ఫెక్షన్లు, కిడ్నీలో మంట కారణంగా ఆక్సీకరణ ఒత్తిడి ఏర్పడుతుంది. ఇవి కిడ్నీలపై ప్రభావం చూపుతాయి.

నిపుణుల అభిప్రాయం ప్రకారం,టమాటా మూత్రపిండాలకు హానికరం కాదు. దాని పోషక విలువ ఒక వ్యక్తి మొత్తం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే, టమాటా కొన్ని సందర్భాల్లో హానికరం.

టమాటాలను ఎవరు తినకూడదు?

– కిడ్నీలో రాళ్లతో బాధపడేవారు దీన్ని తినకూడదు.

– కీళ్ల నొప్పులతో బాధపడేవారు టమాటాలకు దూరంగా ఉండాలి.

– విరేచనాలు అయినప్పుడు టమాటలు తినకూడదు.

– ఎవరికైనా టమాటా అలెర్జీ ఉంటే వారు టమాటాలకు దూరంగా ఉండాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

హైదరాబాద్ అల్లు ఆర్మీ ఉత్సాహం.! పుష్ప వైల్డ్ ఫైర్ జాతర
హైదరాబాద్ అల్లు ఆర్మీ ఉత్సాహం.! పుష్ప వైల్డ్ ఫైర్ జాతర
ఏడాదిలో ఒక్కసారే దొరికే లడ్డూ.! ఇప్పడు మిస్‌ అయితే మళ్లీ ఏడాదికే!
ఏడాదిలో ఒక్కసారే దొరికే లడ్డూ.! ఇప్పడు మిస్‌ అయితే మళ్లీ ఏడాదికే!
గొంతులో ఏదైనా ఇరుక్కుంటే ఎలా తీయాలి.? నీలోఫర్ వైద్యుల డెమో..
గొంతులో ఏదైనా ఇరుక్కుంటే ఎలా తీయాలి.? నీలోఫర్ వైద్యుల డెమో..
ఇలాంటి స్వీట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.! నోరూరిస్తున్న స్వీట్స్‌.
ఇలాంటి స్వీట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.! నోరూరిస్తున్న స్వీట్స్‌.
నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా