Yoga For Memory: ఈ యోగాసనాలతో మెమరీకి బూస్ట్.. వేళ్లతోనే ఈజీగా చేసేయొచ్చు..
చేతి వేళ్లతో సులువుగా చేయగలిగే వ్యాయామం ఇదని యోగా నిపుణురాలు తన ఇన్ స్టా పోస్టులో రాశారు. దీనిపై అనేక అధ్యయనాలు కూడా జరిగాయని, అవన్నీ మెమరీ పవర్ పెరగడానికి ఈ వ్యాయామాలు ఉపయోగపడుతున్నట్లు తేల్చాయని వివరించారు.

ఉరుకుల పరుగుల జీవన విధానంలో మనిషికి జ్ఞాపకశక్తి తగ్గిపోతోంది. కొన్ని సందర్భాల్లో ముఖ్యమైన విషయాలను మర్చిపోయి ఇబ్బందుల్లో పడుతున్నారు. అయితే కొన్ని విధానాలను పాటించడం ద్వారా మీ మెమరీ పవర్ ను పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. సమతుల్య ఆహారం తీసుకోవడం, క్రమతప్పకుండా వ్యాయామం, ధ్యానం వంటి కొన్ని మంచి అలవాట్లను అలవర్చుకోవడం ద్వారా జ్ఞాపకశక్తిని పెంపొందించుకోవచ్చు. అలాగే కొన్ని యోగాసనాలను వేయడం వల్ల కూడా మెమరీ పెరుగుతుందని యోగా నిపుణురాలైన జూహీ కపూర్ తన ఇన్ స్టాగ్రామ్ పేజీపై ఓ వీడియోను పోస్ట్ చేశారు. విద్యార్థులు కూడా తేలికగా వేయగలిగే రెండు యోగాసనాలను వేసి చూపించారు. ఇది విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుందని ఆమె ఆ పోస్టులో వివరించారు. ప్రతి రోజూ చాలా సులభంగా చేయగలిగే ఆ రెండు యోగాసనాలను ప్రాక్టీస్ చేస్తే మెమరీ పవర్ పెరుగుతుందని వివరించారు. ఆ యోగాసనాల గురించి ఇప్పుుడు చూద్దాం..
ఇవి కూడా చదవండిView this post on Instagram
వేళ్లతో చేసే వ్యాయామం..
చేతి వేళ్లతో సులువుగా చేయగలిగే వ్యాయామం ఇదని యోగా నిపుణురాలు తన ఇన్ స్టా పోస్టులో రాశారు. దీనిపై అనేక అధ్యయనాలు కూడా జరిగాయని, అవన్నీ మెమరీ పవర్ పెరగడానికి ఈ వ్యాయామాలు ఉపయోగపడుతున్నట్లు తేల్చాయని వివరించారు. అంతేకాక ఈ ఫింగర్ ఎక్సర్ సైజ్ ద్వారా మెదడు ఉత్తేజితమవుతుందని చెబుతున్నారు. ఫింగరఱ్ యాక్టివిటీ సమయంలో సెరిబ్రల్ బ్లడ్ ఫ్లో పెరగడం వల్ల మేధస్సు పెరగడానికి సాయపడుతుందని వివరించారు.
ఇవే ఆ వ్యాయామాలు..
వేళ్లతో చేసే వ్యాయామాలు రెండు రకాలుగా ఉంటాయని ఆమె తెలిపారు. వాటిల్లో మొదటిది ఫిస్ట్ ఓపెన్ అండ్ క్లోజ్ అంటే వేళ్లను మూస్తూ, తెరుస్తూ ఉండటం. రెండోది థంబ్స్ టు టిప్స్. బోటన వేలి చివరన మిగిలిన వేళ్లతో తాకడం అన్నమాట. ప్రతి రోజూ 2 నుంచి మూడు సార్లు చేయాలని ఆమె సూచించారు. ఈ టెక్నిక్స్ అలవాటు అయితే వేగంగా చేయడానికి అవకాశం ఉంటుంది.
ప్రయోజనాలు ఇవి..
ఈ చిన్న వ్యాయాలు చేయడం ద్వారా జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అలాగే ఏకాగ్రత, ఫోకస్ కుదురుతుంది. నరాలు ఎగ్జైట్ అవుతాయి. క్రియేటివ్ థింకింగ్ పెరుగుతుంది. లాజిక్ గా ఆలోచించడం, రిజనింగ్, అకడమిక్ పర్ఫామెన్స్ అధికమవుతుంది. దీనిని ఎవరైనా ప్రాక్టీస్ చేయొచ్చు. చిన్న పిల్లలు, వృద్ధులకు బాగా ఉపయుక్తంగా ఉంటుంది.
నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..