PM Modi: ప్రధాని మోదీ ఇంటిపై డ్రోన్ చక్కర్లు..ఒక్కసారిగా ఎస్పీజీ పోలీసుల అలర్ట్..
హై సెక్యూరిటీ జోన్‌లో తెల్లవారుజామున డ్రోన్ దొరికింది. ప్రధాని భద్రత బాధ్యతలు నిర్వహిస్తున్న ఎస్పీజీ సిబ్బంది డ్రోన్‌ను గుర్తించారు. వెంటనే ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు విచారణ ప్రారంభించారు.

ఢిల్లీలోని ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసం సమీపంలో డ్రోన్ కనిపించినట్లు సమాచారం. హై సెక్యూరిటీ జోన్‌లో తెల్లవారుజామున డ్రోన్ దొరికింది. ప్రధాని భద్రత బాధ్యతలు నిర్వహిస్తున్న ఎస్పీజీ సిబ్బంది డ్రోన్‌ను గుర్తించారు. వెంటనే ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు విచారణ ప్రారంభించారు. మరింత సమాచారం రావల్సి ఉంది. ఈ ఘటన తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో జరిగింది. ఇంటి భద్రతను SPG నిర్వహిస్తుంది, దేశంలోని అత్యుత్తమ భద్రతా సిబ్బంది బృందం, వారు ఇంటి అధికారిక భద్రతకు బాధ్యత వహిస్తారు. ఢిల్లీలోని హై సెక్యూరిటీ జోన్‌లో ప్రధాని ఇల్లు ఉంది. ఇక్కడ డ్రోన్లకు అనుమతి లేదు. ఇది నో ఫ్లై జోన్ లేదా నో డ్రోన్ జోన్. ఈ ప్రదేశంలో భద్రతా వ్యవస్థలను దాటవేసి డ్రోన్‌ను ఎగురవేశారు.
హై సెక్యూరిటీ జోన్‌లో డ్రోన్‌లు ఎగరకుండా నిరోధించడానికి యాంటీ డ్రోన్ సిస్టమ్ ఉంది. టెక్నాలజీ చేదించకుని ఈ ఉదయం డ్రోన్ రావడంతో అంతా షాక్ అయ్యారు. ఈ ప్రాంతంపై డ్రోన్ ఎందుకు ఎగిరింది.. డ్రోన్ ఎగురవేసింది ఎవరు అనే విషయాలు అధికారులు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
Information about flying a drone in the no-flying zone above the Prime Minister’s residence was received. SPG contacted the police at 5:30 am. Investigation is underway: Delhi Police
— ANI (@ANI) July 3, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం




