Viral Video: సరికొత్త వంటకం స్పైసీ మ్యాగీ సమోసా.. రెసిపీ చూస్తే షాక్.. ఇవేం ప్రయోగాలు బాబోయ్

స్ట్రీట్ ఫుడ్ లో సమోసాకి ముఖ్యమైన స్థానం ఉంది. ఇక మ్యాగీ కూడా ఆదరణ పొందిన వంటకం. చిన్న పెద్ద ఎంతో ఇష్టంగా తింటారు. అయితే సమోసా, మ్యాగీ కాంబినేషన్ లో తయారు చేసిన ఫుడ్ ను ఎప్పుడైనా తిన్నారా..? ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో సమోసాని స్పైసీ మ్యాగీ స్టఫ్ తో తయారు చేశారు.

Viral Video: సరికొత్త వంటకం స్పైసీ మ్యాగీ సమోసా.. రెసిపీ చూస్తే షాక్.. ఇవేం ప్రయోగాలు బాబోయ్
Maggi Samosa
Follow us
Surya Kala

|

Updated on: Jul 03, 2023 | 12:38 PM

సోషల్ మీడియా వేదికలైన ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి వాటిల్లో రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. వీటిల్లో వివిధ రకాల వంటకాలు, ఆహార పదార్థాలు కనిపిస్తాయి. ఒక్కోసారి వీడియోలో తయారు చేసే భిన్నమైన ఫుడ్ ఐటమ్స్ మనుషుల మనసును ఆకర్షిస్తాయి. కొన్ని సార్లు వీడియోలో తయారు చేసే ఆహారపదార్ధాలను చూస్తే మనసుకి తినాలనే భావం కలుగుతుంది. అయితే గత కొంతకాలంగా ఆహారంతో వివిధ ప్రయోగాలు చేస్తున్నారు. కొత్త కొత్త వంటకాలు చేస్తున్నారు. వీటిల్లో కొన్ని వింత వింత వంటకాలు కూడా ఉంటున్నాయి. అసలు అలాంటి వంటలు ఒకటి ఉంటాయని.. తయారు చేస్తారని అసలు వాటిని తినవచ్చు అని కూడా అలోచించి ఉండరు. ప్రస్తుతం అలాంటి ఒక వంటకం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో చూసి నెటిజన్లు ఆహార ప్రియులు కోపంతో దుమ్మెత్తిపోస్తున్నారు.

స్ట్రీట్ ఫుడ్ లో సమోసాకి ముఖ్యమైన స్థానం ఉంది. ఇక మ్యాగీ కూడా ఆదరణ పొందిన వంటకం. చిన్న పెద్ద ఎంతో ఇష్టంగా తింటారు. అయితే సమోసా, మ్యాగీ కాంబినేషన్ లో తయారు చేసిన ఫుడ్ ను ఎప్పుడైనా తిన్నారా..? ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో సమోసాని స్పైసీ మ్యాగీ స్టఫ్ తో తయారు చేశారు. ఇది చూసి కొందరు ముచ్చటపడగా, మరికొంతమంది మతి పోగొట్టుకున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి ముందుగా ఉల్లిపాయలు, మిరపకాయలతో పాటు రకరకాల మసాలా దినుసులు, సమోసాలు మిక్సీలో వేసి మ్యాగీని తయారు చేయడం వీడియోలో చూడవచ్చు. అనంతరం అతను చట్నీతో కస్టమర్లకు ఈ వింత వంటకాన్ని అందించాడు.

ఇవి కూడా చదవండి

ఈ వింత వంటకం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. ఈ వీడియో thegreatindianfoodie అనే ఐడితో షేర్ చేశారు. ఇప్పటివరకు 1 లక్షా 65 వేల కంటే ఎక్కువ వ్యూస్, 5 వేల  లైక్స్  సొంతం చేసుకుంది.

View this post on Instagram

A post shared by UNESCO (@unesco)

ఒకరు ‘మ్యాగీ సమోసాలను చూసిన తర్వాత నాకు కొంచెం భయంగా ఉంది’ అని రాశారు. అదే విధంగా ఈ వింత వంటకాన్ని చూసి ఆత్మ వణికిపోయిందని మరో యూజర్ రాశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..