Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఫన్నీ దొంగ వీడు.. యువతిని విడిచి పారిపోయిన లవర్.. దొంగ దాతృత్వంపై ఓ లుక్ వేయండి..

వైరల్ క్లిప్‌లో రోడ్డుపై ఒక జంట చేయి చేయి పట్టుకుని వెళ్తుంది. ఆ రోడ్డుమీద ఈ ప్రేమికుల జంట తప్ప మరెవరూ లేరు. అప్పుడే అటుగా బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఈ జంటను దోచుకోవాలని భావించారు.  అక్కడికి వచ్చి అమ్మాయి చేతిలోని ఆమె బ్యాగ్ లాక్కున్నాడు.

Viral Video: ఫన్నీ దొంగ వీడు.. యువతిని విడిచి పారిపోయిన లవర్.. దొంగ దాతృత్వంపై ఓ లుక్ వేయండి..
Video Viral
Follow us
Surya Kala

|

Updated on: Jun 30, 2023 | 2:23 PM

నిర్జన ప్రదేశాల్లో దోపిడీలు, దోపిడీలు ప్రపంచవ్యాప్తంగా సర్వసాధారణమైపోయాయి. ఇప్పుడు అత్యాచారాలు, దోపిడీ, దొంగతనాలు నిర్భయంగా పట్టపగలే చేస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో నిర్మానుష్యంగా ఉన్న వీధుల్లో వెళ్తున్న వారు.. అదీ ఒంటరిగా వెళుతున్న వారిని చూస్తే ఇక దొంగలు ఆగుతారు.. కొన్నిసార్లు దుండగులు దోపిడీ చేసిన తర్వాత మనుషులను కూడా చంపుతారు. అయితే ఈ దోపిడీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇందులో దొంగ దాతృత్వం చూసి మీరూ నివ్వెరపోతారు.

వైరల్ క్లిప్‌లో రోడ్డుపై ఒక జంట చేయి చేయి పట్టుకుని వెళ్తుంది. ఆ రోడ్డుమీద ఈ ప్రేమికుల జంట తప్ప మరెవరూ లేరు. అప్పుడే అటుగా బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఈ జంటను దోచుకోవాలని భావించారు.  అక్కడికి వచ్చి అమ్మాయి చేతిలోని ఆమె బ్యాగ్ లాక్కున్నాడు. అయితే దొంగతనం చేస్తున్న సమయంలో  అమ్మాయి ప్రియుడు ఆమెను వదిలి పారిపోయాడు. ఇది చూసిన దుండగులు షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన అంతా అక్కడ అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.

ఇవి కూడా చదవండి

అబ్బాయి అమ్మాయిని అలా ఒంటరిగా వదిలేసి పారిపోవడం చూసిన దొంగలు అమ్మాయిపై జాలిపడుతున్నట్లు వీడియోలో చూడవచ్చు. దీని తర్వాత ఆమె బ్యాగ్‌ని తిరిగి ఇచ్చారు. ఈ షాకింగ్ వీడియో @GarufaCapitan హ్యాండిల్‌తో ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఓ క్యాప్షన్ కూడా ఇచ్చారు, దొంగలు అమ్మాయితో ఈ వ్యక్తి మీకు తగినవాడు కాదని చెప్పారు. అయితే ఆ వీడియో ఎక్కడిది అనే దానిపై ఎలాంటి సమాచారం లేదు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఉగ్రదాడికి స్ట్రాంగ్ ఎన్కౌంటర్! ఇండియాలో PSL బ్యాన్
ఉగ్రదాడికి స్ట్రాంగ్ ఎన్కౌంటర్! ఇండియాలో PSL బ్యాన్
నియంత్రణ రేఖ వెంబడి పాక్ కవ్వింపు చర్యలు.. భారత్ ఆర్మీపై కాల్పులు
నియంత్రణ రేఖ వెంబడి పాక్ కవ్వింపు చర్యలు.. భారత్ ఆర్మీపై కాల్పులు
తొలి బంతికే సిక్స్.. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి ఇలా
తొలి బంతికే సిక్స్.. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి ఇలా
10th విద్యార్ధులకు 2025 అలర్ట్..పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే
10th విద్యార్ధులకు 2025 అలర్ట్..పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే
జూలై 3న అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే
జూలై 3న అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే
ఉగ్రవేటకు రంగం సిద్ధం.. నేడు పహల్గాంకు ఆర్మీ చీఫ్ రాక..!
ఉగ్రవేటకు రంగం సిద్ధం.. నేడు పహల్గాంకు ఆర్మీ చీఫ్ రాక..!
నా పని అయిపోయింది అనుకున్న! ఆక్సిడెంట్ పై ఫ్లింటాఫ్..
నా పని అయిపోయింది అనుకున్న! ఆక్సిడెంట్ పై ఫ్లింటాఫ్..
8 మ్యాచ్‌ల్లో 2 విజయాలు.. 3వ విజయం కోసం చెన్నై, హైదరాబాద్ పోరు
8 మ్యాచ్‌ల్లో 2 విజయాలు.. 3వ విజయం కోసం చెన్నై, హైదరాబాద్ పోరు
పాక్ కి గుణపాఠం చెప్పేందుకు వ్యూహాత్మకంగా భారత్ అడుగులు
పాక్ కి గుణపాఠం చెప్పేందుకు వ్యూహాత్మకంగా భారత్ అడుగులు
ఇంటర్‌లో ఫెయిల్.. UPSCసివిల్స్‌లో మాత్రం సత్తాచాటిన తెలుగు బిడ్డ!
ఇంటర్‌లో ఫెయిల్.. UPSCసివిల్స్‌లో మాత్రం సత్తాచాటిన తెలుగు బిడ్డ!