Gold Royal Enfield: నీ బులెట్ బంగారంగానూ.. సైలెన్సర్‌ సహా అంతా గోల్డే.. ప్రత్యేక ఆకర్షణగా శివాజీ విగ్రహం..

భారతదేశంలో బైక్స్ లో ఎన్నో రకాలు అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ కి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. దశాబ్దాల చరిత్ర ఈ బైక్స్ సొంతం. ముఖ్యంగా బైక్స్ అంటే మోజుపడే యువతకు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్  ఓ స్టేటస్ సింబల్. చిన్న పెద్ద అనే తేడా లేకుండా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్  పై రయ్యి రయ్యిన రోడ్డుమీద దూసుకుని వెళ్లాలని కోరుకుంటారు.

Gold Royal Enfield: నీ బులెట్ బంగారంగానూ.. సైలెన్సర్‌ సహా అంతా గోల్డే.. ప్రత్యేక ఆకర్షణగా శివాజీ విగ్రహం..
Gold Royal Enfield
Follow us
Surya Kala

|

Updated on: Jul 04, 2023 | 10:38 AM

సాధారణంగా బంగారం అంటే అందరూ ఇష్టపడతారు. ముఖ్యంగా భారతీయ మహిళకైతే బంగారం అంటే ఉన్న మోజు గురించి చెప్పనక్కర్లేదు. బంగారు నగలపైన వారికుండే మక్కువ అంతా ఇంతా కాదు. అయితే ఈ బంగారంపై మక్కువ ఒక్క స్త్రీలకే కాదు పురుషులకు కూడా ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే గోల్డ్‌ అంటే వారికి పిచ్చి అని చెప్పవచ్చు. ఎందుకంటే వారికి సంబంధించిన ప్రతిదీ గోల్డ్‌ కలర్‌లో కనిపించాల్సిందే. అప్పుడే దాన్ని వారు ఇష్టపడతారు. అందుకు తగ్గట్టుగానే బంగారం కూడా చాలా ఖరీదైనది. ఇటీవల బంగారం ధరలు బాగా పెరిగిపోతున్నాయి. మరి బంగారం అంటే ఎంత మక్కువ ఉన్నా అందరూ కొనుక్కోలేరు కదా. అందుకే బంగారంపై ఉన్న మక్కువను ఇలా తీర్చుకుంటుంటారు. ఎలా అంటే.. ఇక్కడ ఓ వ్యక్తి తన బుల్లెట్‌ బైక్‌ను మొత్తాన్ని బంగారం రంగులోకి మార్చేశాడు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.

భారతదేశంలో బైక్స్ లో ఎన్నో రకాలు అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ కి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. దశాబ్దాల చరిత్ర ఈ బైక్స్ సొంతం. ముఖ్యంగా బైక్స్ అంటే మోజుపడే యువతకు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్  ఓ స్టేటస్ సింబల్. చిన్న పెద్ద అనే తేడా లేకుండా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్  పై రయ్యి రయ్యిన రోడ్డుమీద దూసుకుని వెళ్లాలని కోరుకుంటారు. అంతేకాదు తమ బైక్ అంటే ఉన్న ఇష్టాన్ని తెలియజేసే విధంగా నచ్చిన రీతిలో మార్పులు చేసి.. సంతోషపడుతూ ఉంటారు. అయితే మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తికీ బంగారం అంటే ఇష్టం.. అదే స్థాయిలో బైక్స్ అన్నా ఇష్టం.. తన ఇష్టాలను కలగలిపి సరికొత్తగా బైక్ ను తయారు చేయించుకుని అందరినీ ఆకర్షించాడు. వివరాల్లోకి వెళ్తే..

ఇవి కూడా చదవండి

పూణేలోని పింప్రి-చించ్వాడ్ కి చెందిన ‘సన్నీ వాఘురే’ అనే వ్యక్తికి బంగారం అన్నా, బైక్స్ అన్నా అంటే చాలా ఇష్టం. అందుకే తన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌ను గోల్డెన్‌ బుల్లెట్‌గా మార్చేసుకున్నాడు. టర్న్ ఇండికేటర్స్, హెడ్‌ల్యాంప్ కవర్, నంబర్ ప్లేట్, ఫ్రంట్ ఫోర్క్ కవర్, ఫుట్‌రెస్ట్‌లు, క్లచ్, లివర్, ఓడోమీటర్ అన్నీ గోల్డెన్ కలరే.

Gold royal enfield

అయితే ఈ బైక్ బంగారంతో తయారు చేయడమే స్పెషల్ అంటే.. మరింతగా ఆకట్టుకుంది బైక్ హ్యాండిల్‌బార్‌పై ఛత్రపతి శివాజీ మహారాజ్ బొమ్మ. గోల్డ్‌ కలర్‌లో ఉన్న శివాజీతో తనకు ఉన్న ప్రేమని ఇష్టాన్ని ప్రదర్శించాడు. అయితే గోల్డెన్ బుల్లెట్ రైడ్ చేసి.. నార్మల్ వ్యక్తిలా కనిపిస్తే అది ఎరువు తీసుకున్న బైక్ అనుకునే ప్రమాదం ఉందని అనుకున్నాడేమో.. బైకుకి మ్యాచింగ్ అయ్యేలా బంగారు ఉంగరాలు, బ్రాస్‌లెట్, వాచ్ ధరించాడు. ఈ బైక్ సైలెన్సర్ కూడా బంగారు రంగులోనే ఉంది. ఈ వీడియో రాయల్ బుల్లెట్ 5577 అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్‌ చేశారు. ఇప్పుడు ఈ గోల్డెన్‌ బుల్లెట్‌ నెట్టింట దూసుకుపోతోంది. దీనిపై రకరకాలుగా స్పందిస్తున్నారు నెటిజన్లు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..