సూర్యుడి చుట్టూ రంగుల వలయం..  ఫోటోలు వైరల్

సూర్యుడి చుట్టూ రంగుల వలయం.. ఫోటోలు వైరల్

Phani CH

|

Updated on: Jul 04, 2023 | 9:57 AM

వరంగల్‌లో శుక్రవారం అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. సూర్యుడి చుట్టూ ఇంద్రధనుస్సు అందంగా పరుచుకుంది. దీంతో పలువురు ఈ దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించి సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నారు. హాలో సన్‌ అంటూ ఫోటోలను షేర్‌ చేస్తున్నారు. మధ్యాహ్నం 12 తర్వాత సూర్యుడి చుట్టూ గుండ్రంగా

వరంగల్‌లో శుక్రవారం అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. సూర్యుడి చుట్టూ ఇంద్రధనుస్సు అందంగా పరుచుకుంది. దీంతో పలువురు ఈ దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించి సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నారు. హాలో సన్‌ అంటూ ఫోటోలను షేర్‌ చేస్తున్నారు. మధ్యాహ్నం 12 తర్వాత సూర్యుడి చుట్టూ గుండ్రంగా రెయిన్ బో చాలా స్పష్టంగా కనిపించింది. గతంలో ఇలాంటి దృశ్యం హైదరాబాద్‌లో కూడా దర్శనమిచ్చింది. అప్పట్లో ఆ దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీన్ని సన్ హాలో అని కూడా అంటారు. సూర్యుడి చుట్టూ కానీ, చంద్రుడి చుట్టూ కానీ ఇలా వలయాకారం ఏర్పడటం వర్షానికి లేదా మంచు కురవడానికి సూచిక అంటారు. సూర్యుడి చుట్టూ వలయాకారం ఏర్పడటం అశుభమంటూ గతంలో కొన్ని పుకార్లు షికారు చేసాయి. అయితే ఈ పుకార్లను నమ్మొద్దని బిర్లా ప్లానిటోరియం శాస్త్రవేత్తలు అప్పట్లో స్పష్టం చేసారు. సైంటిఫిక్ పరిభాషలో వీటిని “22-డిగ్రీ హలోస్” అని పిలుస్తారని తెలిపారు. ఎందుకంటే ఒక ప్రదేశంలో ఒక పరిశీలకునికి సూర్యుడు లేదా చంద్రుని చుట్టూ ఏర్పడ్డ రింగ్ సుమారు 22 డిగ్రీల వ్యాసార్థం ఉంటుందన్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వావ్‌.. ఏం టైమింగ్ గురూ.. మూడు తలల చీతా .. ఎప్పుడైనా చూసారా ??

పిడుగు పడుతున్న వీడియో చూసారా.. షాకింగ్‌ వీడియో వైరల్‌

తిరుమలలో అరుదైన తొండ.. తిరునామాలతో దర్శనం

ముచ్చటపడి నోట్ల కట్టలతో సెల్ఫీలు .. చివరికి ..

కరీంనగర్‌లో కెమెరా దేవత.. ప్రత్యేక పూజలు చేసిన భక్తులు