తిరుమలలో అరుదైన తొండ.. తిరునామాలతో దర్శనం

తిరుమలలో అరుదైన తొండ.. తిరునామాలతో దర్శనం

Phani CH

|

Updated on: Jul 04, 2023 | 9:54 AM

త్రేతాయుగంలో శ్రీరాముడు సముద్రంపై వంతెన నిర్మిస్తున్న సమయంలో ఓ ఉడుత రాముడికి సహాయం చేయడానికి వచ్చింది. దాని భక్తికి మెచ్చిన శ్రీరాముడు ప్రేమతో ఆ ఉడుతను తన చేతుల్లోకి తీసుకుని ఆ చిన్ని ప్రాణిని ఆశీర్వదించాడు రాముడు. అప్పటినుంచి ఉడుత ఒంటిపై శ్రీరాముడి చేతిముద్రలు

త్రేతాయుగంలో శ్రీరాముడు సముద్రంపై వంతెన నిర్మిస్తున్న సమయంలో ఓ ఉడుత రాముడికి సహాయం చేయడానికి వచ్చింది. దాని భక్తికి మెచ్చిన శ్రీరాముడు ప్రేమతో ఆ ఉడుతను తన చేతుల్లోకి తీసుకుని ఆ చిన్ని ప్రాణిని ఆశీర్వదించాడు రాముడు. అప్పటినుంచి ఉడుత ఒంటిపై శ్రీరాముడి చేతిముద్రలు ఒంటిపై చారలుగా ఏర్పడి ధన్యమైంది ఆ ఉడుత. ఇప్పడు అలాంటి మరో జీవి తిరుమల పుణ్యక్షేత్రంలో దర్శనమిచ్చింది. ఈ జీవిని ఆ శ్రీనివాసుడే ఆశీర్వదించాడా అన్నట్టుగా అబ్బురపరుస్తోంది. ఏడు కొండల్లో ఒంటిపై శ్రీనివాసుడి తిరునామాలతో ఓ తొండ దర్శనమిచ్చింది. శేషాచలం అటవీ ప్రాంతంలో కనిపించిన ఈ తొండ తలపైనుంచి వీపు భాగం మొత్తం నల్లని ఒంటిపై తెల్లని తిరునామాలు, మధ్యలో సింధూరంతో తీర్చిదిద్దిన తిరునామం కలిగి చూపరులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఫారెస్ట్ లిజార్డ్ గా పిలిచే ఈ తొండ అలిపిరి సమీపం లోని ఓ బండపై దర్శనమిచ్చింది. ఈ అరుదైన లిజార్డ్ దక్షిణ భారత దేశంలోని రాతి కొండలు ఉన్న అడవుల్లో ఎక్కువగా కనిపిస్తుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ముచ్చటపడి నోట్ల కట్టలతో సెల్ఫీలు .. చివరికి ..

కరీంనగర్‌లో కెమెరా దేవత.. ప్రత్యేక పూజలు చేసిన భక్తులు

రివాల్వర్‌తో రెచ్చిపోయిన సచివాలయ ఉద్యోగి.. ఆ తర్వాత..

పిల్లికి పోస్ట్‌మార్టం… కేసు తేల్చలేక తల పట్టుకుంటున్న పోలీసులు

కిచెన్‌లోకీ వచ్చేసిన ఏఐ టెక్నాలజీ.. నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో