Video: సెక్యూరిటీ గార్డును బైక్‌పై డ్రాప్ చేసిన మిస్టర్ కూల్.. దటీజ్ ధోనీ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్..
MS Dhoni Viral Video: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి సంబంధించిన ఏ విషయమైనా.. సోషల్ మీడియాలో వాలితే వైరల్‌గా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. విజయాలు వస్తే పొంగిపోవడం, ఓటమి ఎదురైతే కుంగిపోవడం ఏమాత్రం కనిపించవు.
MS Dhoni: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి సంబంధించిన ఏ విషయమైనా.. సోషల్ మీడియాలో వాలితే వైరల్‌గా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. విజయాలు వస్తే పొంగిపోవడం, ఓటమి ఎదురైతే కుంగిపోవడం ఏమాత్రం కనిపించవు. ఇదే క్వాలిటీ ధోనిని ఎంతో మందికి చేరువచేసింది. అలాగే తన చుట్టూ ఉన్న వ్యక్తులను గౌరవించడం ధోనికి ఇష్టం. అది ఎవరైనా కావచ్చు. అది కుటుంబ సభ్యుడైనా లేదా ఇంటి పనిలో సహాయపడే వ్యక్తి అయినా. తాజాగా ఇలాంటి సీన్‌తో మిస్టర్ కూల్ నెట్టింట్లో వైరల్‌గా మారాడు. తన ఫామ్‌హౌస్‌లోని సెక్యూరిటీ గార్డు వద్దను తన బైక్‌పైకి ఎక్కించుకుని గేటు వరకు తీసుకెళ్లి మరీ దించేశాడు. గేటు బయట నిలబడి ఎవరో వీడియో తీశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడానికి ఎక్కువ సమయం కూడా పట్టలేదు.
మహేంద్ర సింగ్ ధోనీకి రాంచీలో భారీ ఫామ్‌హౌస్ ఉంది. ధోనీ తన తీరిక రోజుల్లో ఎక్కువ సమయం అక్కడే గడుపుతాడు. ఐపీఎల్ మినహా.. మిగతా సమయం అంతా ఇక్కడే గడిపేస్తుంటాడు. ధోని తన కుటుంబం, వ్యవసాయం, వివిధ బ్రాండ్‌ల ప్రకటనలు మొదలైనవాటితో తన మిగిలిన సమయాన్ని గడుపుతున్నాడు. రాంచీలో ఉన్న ఈ ఫామ్‌హౌస్ చాలా పెద్దది. ప్రధాన ద్వారం నుంచి చాలాదూరం వరకు నడవాల్సి ఉంటుంది. ధోని ఫామ్‌హౌస్‌లోని సెక్యూరిటీ గార్డు విధులు ముగించుకుని వెళ్లే సమయం ఆసన్నమైంది. దీంతో ఆ సెక్యూరిటీ గార్డును ధోనీ బైక్‌పై మెయిన్ గేట్ వరకు దించేందుకు సిద్ధమయ్యాడు. తరుచుగా ఇలానే చేస్తుంటాడంట.
Dhoni’s Farmhouse is so big that he need bike to drop security guard at the Entrance 😭
PS : Lucky security guard who gets bike ride with Dhoni . pic.twitter.com/l0KS3dkwmj
— MAHIYANK ™ (@Mahiyank_78) July 2, 2023
ఆ వీడియోలో ధోని సెక్యూరిటీ గార్డును గేటు ముందు వదిలి బైక్‌ను తిప్పుకుని వెళ్తున్నట్లు కనిపిస్తోంది. గేటు బయట ఎవరో వీడియో తీస్తున్న సంగతిని సీఎస్‌కే కెప్టెన్ మిస్ అవ్వలేదు. బయలుదేరే ముందు ఫ్యాన్‌కి బై చెప్పి వెళ్లాడు. మహియాంక్ అనే ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ వీడియోను ట్వీట్ చేశారు. ‘‘ఆ సెక్యూరిటీ గార్డు చాలా అదృష్టవంతుడు’’ అని క్యాఫ్షన్ రాశారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..