MS Dhoni: ధోనీ ‘కీలక’ సలహా.. కట్‌చేస్తే.. టీమిండియాలో ఎంట్రీ ఇచ్చిన నయా పేసర్..
Mukesh Kumar Meet Ms Dhoni: టీమిండియా జులై 12 నుంచి వెస్టిండీస్ పర్యటనను ప్రారంభించనుంది. ఈ పర్యటనకు ప్రకటించిన రెండు ఫార్మట్ల జట్లలో ముఖేష్ కుమార్‌కు చోటు దక్కింది.
Mukesh Kumar Meet Ms Dhoni: భారత క్రికెట్ జట్టు ఆటగాడు ముఖేష్ కుమార్ దేశవాళీ మ్యాచ్‌లలో మంచి ప్రదర్శన చేశాడు. అలాగే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కూడా మంచి ప్రదర్శన కనబరిచాడు. ఈ కారణంగానే ముఖేష్‌కి టీమిండియాలో చోటు దక్కింది. ప్రస్తుతం భారత్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరిగే వన్డే, టెస్ట్ సిరీస్ కోసం జట్టులో సభ్యుడిగా చేరాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసే అవకాశం ముఖేష్‌కి ఇంకా రాలేదు. తాజాగా మహేంద్ర సింగ్ ధోనీని ప్రశంసిస్తూ మాట్లాడాడు. దీంతో సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాడు.
ఐపీఎల్‌లో తొలిసారిగా ధోనిని కలిసిన ముఖేష్ కుమార్..
టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖేష్ కుమార్ మాట్లాడుతూ, నేను ఐపీఎల్‌లో ఎంఎస్ ధోనిని మొదటిసారి కలిశాను. ఈ సమావేశంలో ధోనీ ఒక సలహా ఇచ్చాడు. దానిని నేను పాటించాను’ అంటూ చెప్పుకొచ్చాడు.
ముఖేష్ మాట్లాడుతూ, “నేను ఎప్పుడూ ధోనీ భయ్యాని కలవాలని, కొన్ని విషయాలు అడగాలని అనుకున్నాను. ఐపీఎల్ దీన్ని సాధ్యం చేసింది. కెప్టెన్‌గా, వికెట్‌కీపర్‌గా బౌలర్లకు ఏం చెబుతారంటూ నేను ధోనిని అడిగాను’ అంటూ చెప్పుకొచ్చాడు.
ప్రయత్నించకుండా నేర్చుకోలేరు..
ముఖేష్ కుమార్ మాట్లాడుతూ, “ధోని నా భుజంపై చేయి వేసి, ‘మీరు ప్రయత్నించనప్పుడు, మీరు నేర్చుకోరని నేను నా బౌలర్లకు చెబుతాను. కాబట్టి మీరు చేయాలనుకున్నది చేయండి. మీరు ఏదీ చేయలేకపోతే, మీరు నేర్చుకోలేరు’ అంటూ తన విలువైన సలహాలు’ ఇచ్చాడు. ఫలితాలను మరచిపోవాలని, ప్రయత్నించమని గొప్ప సలహా ధోని నుంచి తీసుకున్నాను, అదే మ్యాచ్‌ల్లో ప్రయత్నిస్తుంటాను అంటూ ముఖేష్ తాజాగా ప్రకటించాడు.
“నాకు అవకాశం ఇచ్చినందుకు ఢిల్లీ క్యాపిటల్స్‌కు నేను చాలా కృతజ్ఞతలు. ఐపీఎల్‌లో ఇదొక మంచి అనుభవం. ఇషాంత్ భయ్యా కూడా చాలా సహాయం చేశాడు. ఎన్నో కోణాల్లో బంతిని ఎలా సంధించాలో నేర్పించాడు. నా బౌలింగ్‌ను మెరుగుపరుచుకోమని సలహా ఇచ్చాడు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడిన ముఖేష్ కుమార్ ఈ కాలంలో 7 వికెట్లు పడగొట్టాడు. 2023లో అతను ఢిల్లీ క్యాపిటల్స్‌లో భాగంగా ఉన్న సంగతి తెలిసిందే.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..