World Cup 2023: ఈ లెక్కలేంట్రా బాబు.. ప్రపంచ కప్ 2023 విజేతను మార్చేసిన వెస్టిండీస్.. ఆ హిస్టరీ రిపీటైతే ట్రోఫీ గెలిచేది పాకిస్తానే?
Pakistan Cricket Team, World Cup 2023: పాకిస్తాన్ ప్రభుత్వం తన జట్టుకు ఇంకా అనుమతి ఇవ్వలేదు. కానీ, ఓ యాదృచ్చికం ఖచ్చితంగా జరిగితే తమ జట్టును భారతదేశానికి పంపకుండా ఆపలేరనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు కానీ.. అక్టోబర్ 5 నుంచి జరగనున్న ప్రపంచకప్ కోసం పాక్ జట్టు భారత్‌కు వచ్చే అవకాశం ఉంది. పాకిస్థాన్ అభిమానులే కాదు.. భారత అభిమానులు కూడా పాకిస్థాన్ ప్రపంచకప్ కోసం భారత్ రావాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా టీమిండియాతో పాకిస్థాన్ పోరును చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా జనాలు కోరుకుంటున్నారు.
మూడు నెలల తర్వాత జరిగే టోర్నీకి 10 జట్లకు 9 జట్ల నిర్ణయమైంది. టోర్నీలో శ్రీలంక తన స్థానాన్ని సంపాదించుకుంది. చివరి స్థానం కోసం పోరు సాగుతోంది. రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన వెస్టిండీస్‌దే ఆ జట్టు అని అనుకున్నా అది కుదరలేదు. వెస్టిండీస్ తొలిసారి ప్రపంచకప్‌లో ఆడడంలేదు. అయితే, ఈ విషయం పాకిస్తాన్‌కు కలిసివచ్చేలా ఉందంట.
వెస్టిండీస్ వల్ల పాకిస్థాన్ గెలుస్తుందా?
పాకిస్తాన్ మాత్రమే దాని ప్రయోజనం పొందగలదని తెలుస్తోంది. ప్రపంచ ఛాంపియన్‌గా ఎదగాలనే పాకిస్థాన్ కలలకు ఇదే నిదర్శనం. ఇందుకోసం 6 ఏళ్లు వెనక్కి వెళ్లాలి. ఇది దాదాపు 2017, ఇంగ్లాండ్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ జరిగినప్పటి సంగతి. ఆ టోర్నీలో పాకిస్థాన్ విజయం సాధించింది. ఆ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కూడా వెస్టిండీస్ టీం ఆడలేదు. అప్పుడు కరేబీయన్ టీం ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించలేకపోయింది.
ఇవి కేవలం సూచనలే అయినప్పటికీ.. మ్యాచ్ మొదలయ్యే వరకు ఇలాంటి సూచనలపై అభిమానుల్లో చర్చ నడుస్తుంది. ఈ యాదృచ్ఛికం ప్రపంచ కప్‌లో కూడా వాస్తవంగా మారితే, అప్పుడు పాకిస్తాన్ అభిమానులు బహుశా మరింత సంతోషిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే 2017లో పాకిస్తాన్ ఫైనల్‌లో భారత్‌ను ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది.
ఫైనల్‌లో కూడా అదృష్టం ఉండదా?
టీమ్ ఇండియా అభిమానుల విషయానికొస్తే, ఇలాంటి సూచనలను పెద్దగా పట్టించుకోరు.అయితే, పాత ఐసీసీ టోర్నమెంట్ల నుంచి కొన్ని యాదృచ్ఛికాలు కలిస్తే.. భారతదేశంలో ప్రపంచ కప్ జరిగినప్పుడల్లా ఇది కూడా గుర్తుంచుకోవాలి. ఛాంపియన్స్ ట్రోఫీ అయినా, టీ20 ప్రపంచకప్ అయినా.. పాకిస్థాన్ జట్టు ఒక్కసారి కూడా ఫైనల్స్‌కు చేరుకోలేదు. అంటే ఈసారి కూడా పాకిస్తాన్‌కు దారి కష్టమేనని తెలుస్తోంది.
అయితే, అలాంటి ఘనత పాకిస్థాన్‌కు లేదని దీని అర్థం కాదు. ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై ఏకపక్షంగా రికార్డు సృష్టించినప్పటికీ, బాబర్ అజామ్ జట్టుతో టీమిండియా జాగ్రత్తగా ఉండాల్సింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..