Thursday Remedies: గురువారం రోజున ఇలా చేస్తే మీ జాతకం బలపడుతుంది.. సిరిసంపదలు కలుగుతాయి..!

Thursday Remedies: హిందూమత ఆచార సంప్రదాయాల ప్రకారం గురువారం రోజున ప్రజలు శ్రీ మహావిష్ణువు, బృహస్పతి ని పూజిస్తారు. జాతకంలో బృహస్పతి స్థానం బలోపేతం అవడానికి ఈ రోజు చాలా అనుకూలమైన రోజు అని వేద పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా గురువు బలంగా ఉంటే..

Thursday Remedies: గురువారం రోజున ఇలా చేస్తే మీ జాతకం బలపడుతుంది.. సిరిసంపదలు కలుగుతాయి..!
Sri Maha Vishnu
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 06, 2023 | 6:25 AM

Thursday Remedies: హిందూమత ఆచార సంప్రదాయాల ప్రకారం గురువారం రోజున ప్రజలు శ్రీ మహావిష్ణువు, బృహస్పతి ని పూజిస్తారు. జాతకంలో బృహస్పతి స్థానం బలోపేతం అవడానికి ఈ రోజు చాలా అనుకూలమైన రోజు అని వేద పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా గురువు బలంగా ఉంటే.. సదరు వ్యక్తుల జీవితంలో అంతా శుభమే జరుగుతుందని చెబుతున్నారు. జీవితంలో అంతా మేలే జరుగుతుంది. ఒకవేళ బృహస్పతి బలహీనంగా ఉన్నట్లయితే.. సదరు వ్యక్తులు నిత్యం ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే, గురువారం నాడు కొన్ని చర్యలు చేపట్టడం ద్వారా జాతకంలో బృహస్పతి బలం పెరుగుతుందని వేదపండితులు సూచిస్తున్నారు. మరి ఆ పరిహారాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

గురువారం పాటించాల్సిన పరిహారాలు..

1. గురువారం తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఆ తరువాత ఇంట్లో పూజగదిలో ఉన్న విష్ణువును పూజించాలి. నెయ్యి దీపం వెలిగించాలి. కాలవ వత్తితో ఈ దీపాన్ని వెలిగించి, అందులో కాస్త కుంకుమ వేయాలి. ఇలా చేయడం ద్వారా నారాయణుడు సంతోషించి, మీపై కరుణ చూపుతాడు.

2. గురువారం రోజున విష్ణు చాలీసా, విష్ణు సహస్త్రనామం పఠించాలి. తద్వారా మీరు, మీ కుటుంబ సభ్యులకు శ్రీ మహా విష్ణువు ఆశీర్వాదం లభిస్తంది. జీవితంలో పురోగతి సాధిస్తారు. గురువారం ఉదయం స్నానం చేసిన తరువాత, పూజగదిని గంగాజలంతో శుభ్రం చేసి, ఆచారాల ప్రకారం విష్ణువును పూజించాలి. ఆ తరువాత విష్ణు కథ చదవాలి. కుశ ఆసనంపై కూర్చొని మాత్రమే విష్ణు చాలీసా, విష్ణు సహస్త్రనామం చదవాలి.

3. శ్రీ మహావిష్ణువుకు పసుపు అంటే చాలా ఇష్టం. గురువారం నాడు విష్ణు చాలీసా, విష్ణు సహస్రనామం చదివిన తరువాత దేవునికి కొన్ని పుసుపు రంగులో ఉన్న పదార్థాలను, మిఠాయిలను నైవేద్యంగా సమర్పించాలి. అరటి పండు, బొప్పాయి వంటి పండ్లను గురువారం నాడు అవసరమైన వారికి దానం చేయాలి. ఇలా చేయడం వలన జాతకంలో బృహస్పతి స్థానం బలపడుతుంది.

4. గురువారం నాడు కుంకుమతో పూజలు చేయడం ద్వారా జాతకంలో గ్రహ పరిస్థితి మెరుగవుతుంది. ఆ రోజు రాత్రి పడుకునే ముందు పాలలో కుంకుమ పువ్వును కలిపి తాగాలి. పాలు, కుంకుమ పువ్వుతో ఖీర్ చేసి, ముందుగా విష్ణువుకు నైవేద్యంగా సమర్పించాలి. ఆ తరువాత కుటుంబ సభ్యులందరూ ప్రసాదంగా ఆరగించాలి. ఇలా చేయడం వల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి.

5. గురువారం రోజున మీకు సంబంధించి, సన్నిహితమైన ఆధ్యాత్మిక గురువు ఎవరైనా ఉంటే.. వారిని కలిసి ఏవైనా దానం, బహుమతిగా ఇవ్వాలి. ఆయన పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకోవాలి. ఇలా చేయడం వలన మీ జీవితంలో అంతా శుభమే జరుగుతంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..