Vijayawada: విజయవాడలో ఘోర అగ్నిప్రమాదం.. 400లకు పైగా వాహనాలు దగ్ధం..
Vijayawada News: విజయవాడ నగరంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది...ఏలూరు రోడ్ లోని స్టెల్లా కాలేజ్ సమీపంలో ఉన్న టీవీఎస్ షో రూమ్ అగ్నికి ఆహుతైంది...400లకు పైగా టూ వీలర్స్ అగ్ని ప్రమాదంలో దగ్ధం అయ్యాయి. ఏలూరు రోడ్ లోని స్టెల్లా కాలేజ్ సమీపంలో ఉన్న షో రూమ్ లో తెల్లవారు జామున 5 గంటల ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాద సమయంలో దాదాపు 650 కు పైగా ఎలెక్ట్రిల్ ,పెట్రోల్ వాహనాలు షో రూమ్ లో ఉన్నట్లు యాజమాన్యం చెబుతోంది.
విజయవాడ, ఆగస్టు 24: విజయవాడ నగరంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది…ఏలూరు రోడ్ లోని స్టెల్లా కాలేజ్ సమీపంలో ఉన్న టీవీఎస్ షో రూమ్ అగ్నికి ఆహుతైంది…400లకు పైగా టూ వీలర్స్ అగ్ని ప్రమాదంలో దగ్ధం అయ్యాయి. ఏలూరు రోడ్ లోని స్టెల్లా కాలేజ్ సమీపంలో ఉన్న షో రూమ్ లో తెల్లవారు జామున 5 గంటల ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాద సమయంలో దాదాపు 650 కు పైగా ఎలెక్ట్రిల్ ,పెట్రోల్ వాహనాలు షో రూమ్ లో ఉన్నట్లు యాజమాన్యం చెబుతోంది. తెల్లవారు జామున భారీ ఎత్తున ఎగసి పడ్డ మంటలు గంటన్నర వ్యవధిలోనే షో రూమ్ మొత్తాన్ని పూర్తిగా దగ్ధం చేసాయి. ఈ అగ్ని ప్రమాదంలో 400 కు పైగా కొత్త వాహనాలతో పాటు కొన్ని సర్వీస్ కు వచ్చిన వాహనాలు పూర్తిగా కాళీ బూడిదయ్యాయి. ఈ అగ్నిప్రమాదంలో లోపల మనుషులు లేకపోవటంతో ప్రాణ నష్టం తప్పి భారీగా ఆస్తి నష్టం జరిగింది. భారీ ఎత్తున ఎగసి పడ్డ మంటలతో బిల్డింగ్ మొత్తం దగ్ధం అయింది.
ఉదయానే లోపల ఏవో శబ్దాలు వస్తున్నాయంటూ సెక్యూరిటీ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో అలెర్ట్ అయినా యాజమాన్యం ఫైర్ సిబ్బందికి సమాచారం అందించింది. నిమిషాల్లోనే ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు. సర్వీస్ రూమ్ లో షాట్ సర్క్యూట్ కారణంగా ఫైర్ యాక్సిడెంట్ అయినట్లుగా యాజమాన్యం చెప్తున్నప్పటికీ ఈ ఫైర్ యాక్సిడెంట్ పై అనేక అనుమానాలున్నాయి. షాట్ సర్క్యూట్ ఫైర్ యాక్సిడెంట్‌కు కారణమా లేక ఇతర కారణాలు ఏమన్నా వున్నాయా అనే కోణంలో కేస్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న క్లూస్ టీం ఫైర్ యాక్సిడెంట్ కు గల కారణాలపై ఆధారాలను సేకరిస్తుంది.
దాదాపు మూడు ఫైరింజన్లు ఘటనాస్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నించాయి. ప్రీఫ్యాబ్రిక్ పద్ధతిలో నిర్మించిన షోరూమ్ కావడం వల్లే మంటలు వేగంగా వ్యాపించాయని అగ్నిమాపక సిబ్బంది చెబుతున్నారు. గోదాములో సాధారణ టూ వీలర్లతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలు కూడా పెద్ద సంఖ్యలో ఉండటంతో మంటలు వేగంగా విస్తరించాయని పేర్కొన్నారు. మరోవైపు పెట్రోల్ వాహనాలను ఉంచే గోదాము సమీపంలోనే పెద్ద సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలను కూడా పార్క్ చేసి ఉంచడం.. అలాగే వాటికి ఛార్జింగ్ పెట్టడం వల్ల కూడా ప్రమాదం జరిగి ఉండొచ్చని మరికొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని.. తర్వాత అన్ని విషయలా వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..