Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Rains: ఏపీలో వచ్చే 3 రోజుల వాతావరణం ఇలా.. అక్కడ తేలికపాటి వర్షాలు

ఏపీకి ఇంకా వర్షాల ముప్పు పొంచి ఉందా.? నైరుతి బంగాళాఖాతంలో ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో వచ్చే 3 రోజులు ఆంధ్రప్రదేశ్ వాతావరణ వివరాలు ఎలా ఉంటాయో ఈ స్టోరీలో ఇప్పుడు తెలుసుకుందామా మరి.. లేట్ ఎందుకు ఓసారి లుక్కేయండి ఇప్పుడు.

AP Rains: ఏపీలో వచ్చే 3 రోజుల వాతావరణం ఇలా.. అక్కడ తేలికపాటి వర్షాలు
Ap Rains
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 01, 2025 | 1:41 PM

నిన్నటి నైరుతి బంగాళాఖాతం మీద ఉన్న తూర్పు గాలులలో, సగటున సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వద్ద ఏర్పడిన అల్పపీడన ద్రోణి ఈరోజు బలహీనపడినది. దిగువ ట్రోపోఆవరణములో, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాంలో నైరుతి దిశగా ,దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్, రాయలసీమలో ఈశాన్య/తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయి.

—————————————- వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు : ————— ———————————-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :- ————————————

ఈరోజు, రేపు:-

పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. పొగ మంచు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉన్నది.

ఇవి కూడా చదవండి

ఎల్లుండి:-

పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :- ——————————–

ఈరోజు:-

తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. పొగ మంచు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉన్నది.

రేపు:-

పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. పొగ మంచు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉన్నది

ఎల్లుండి:-

పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

రాయలసీమ :- —————-

ఈరోజు:-

తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. పొగ మంచు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉన్నది. కనిష్ట ఉష్ణోగ్గతలు సాధారణముగా కంటే 2 నుండి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.

రేపు:-

పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. పొగ మంచు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉన్నది. కనిష్ట ఉష్ణోగ్గతలు సాధారణముగా కంటే 2 నుండి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.

ఎల్లుండి:-

పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. కనిష్ట ఉష్ణోగ్గతలు సాధారణంగా కంటే 2 నుండి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.