AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: పైకేమో సుప్పిని.. సుద్దపూసని.. కట్ చేస్తే.. మద్యం మాటున మాయదారి యవ్వారం

పైకేమో సుప్పిని.. సుద్దపూసని.. అని మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. ఇతడో పెద్ద మాయగాడు. పని చేసేది ఏమో హోమ్ గార్డు వృత్తిలో.. తీరా ఇతడు ఏం పని చేశాడో తెలిస్తే.. దెబ్బకు షాక్ అయిపోతారు. ఇంతకీ ఆ కథ ఏంటంటే..

AP News: పైకేమో సుప్పిని.. సుద్దపూసని.. కట్ చేస్తే.. మద్యం మాటున మాయదారి యవ్వారం
Representative Image
Ravi Kiran
|

Updated on: Jan 31, 2025 | 3:21 PM

Share

బాపట్ల జిల్లా రేపల్లె చోడాయిపాలెం గ్రామానికి చెందిన చిక్కాల సుమన్ అనే వ్యక్తి 2006 సంవత్సరం నుంచి హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. అప్పటినుంచి అతడు అనేక మంది పోలీస్ అధికారుల వద్ద పనిచేసినట్లు కవరింగ్ ఇస్తూ మోసాలకు పాల్పడుతున్నాడు. హోంగార్డ్ సుమన్ చెడు వ్యసనాలకు, క్రికెట్ బెట్టింగులకు అలవాటు పడి డబ్బును పోగొట్టుకుని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడు. అయితే అతడు ఈ మధ్యకాలంలో హోంగార్డు డిప్యూటేషన్‌పై జిఆర్‌పిఎఫ్ విజయవాడలో చేరాడు. హోంగార్డు సుమన్ ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ డబ్బులు ఏ విధంగానైనా సరే సంపాదించాలనే దురుద్దేశంతో గూగుల్‌లో కొంతమంది సర్పంచుల ఫోన్ నెంబర్లు సేకరించి వారి ద్వారా ఆ గ్రామంలో ఉన్న వైన్ షాపుల వివరాలు.. వారి ఫోన్ నెంబర్లు తెలుసుకుని సదరు వైన్ షాప్‌కు చెందిన వ్యక్తులకు ఫోన్లు చేసివారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడు.

ఇటీవల కాలంలో మచిలీపట్నం తాళ్లపాలెం పంచాయతీలో గల వసుధ వైన్స్‌కు ఫోన్ చేసి తాను ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ నుంచి మాట్లాడుతున్నట్లు తనకు రూ.6 వేలు ఫోన్‌పే చేయమని.. లేదంటే వారి షాపు లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డాడు. వసుధ వైన్స్ యాజమాన్యం నుంచి రూ. 6 వేలు ఫోన్‌పేలో డబ్బులు తీసుకున్నాడు. మరుసటి రోజు సుమారు 9 గంటల ప్రాంతంలో సదరు హోంగార్డ్ పని మీద మచిలీపట్నం వచ్చి వసుధ వైన్స్ యజమానికి ఫోన్ చేసి డబ్బులు అడిగాడు. అయితే తన అకౌంట్‌లో డబ్బులు లేవని క్యాష్ మాత్రమే ఉందని చెప్పి.. చేతికి ఇస్తానని హోంగార్డును బీచ్ రోడ్‌లో గల ఎస్వీహెచ్ ఇంజనీరింగ్ కాలేజ్ వద్దకు రమ్మని చెప్పాడు. అంతేకాకుండా అదే చేతితో పోలీసులకు కూడా సమాచారం అందించాడు వసుధా వైన్స్ యజమాని. ఇక రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ వైన్స్ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. హోంగార్డును రిమాండ్‌కి తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి