Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: అతడికి 20.. ఆమె 17.. ప్రేమించి పెళ్లాడాడు.. చివరికి తల్లి చెప్పిందని భార్యతో అలా..

ప్రేమంటూ వెంటబడ్డారు.. నువ్వులేకపోతే నేను లేనంటూ కబుర్లు చెప్పాడు.. పెళ్లిచేసుకోకపోతే చచ్చిపోతానని బెదిరించాడు.. ఇదంతా నిజమేనని నమ్మింది ఆ బాధితురాలు.. ప్రేమించినవాడి మాటలు నమ్మి..తల్లిదండ్రులను సైతం కాదని గడప దాటింది.. అయితే ఆ తర్వాతే అసలు కథ మొదలయింది.. ఆ వివరాలు

AP News: అతడికి 20.. ఆమె 17.. ప్రేమించి పెళ్లాడాడు.. చివరికి తల్లి చెప్పిందని భార్యతో అలా..
Telugu News
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 30, 2025 | 8:58 AM

పెద్దాపురం పట్టణానికి చెందిన నీలిమ..స్థానికంగా వ్యభిచార గృహం నిర్వహిస్తోంది. ఆమెకు చందు అనే కుమారుడు ఉన్నాడు. ప్రేమ పేరుతో అమ్మాయిలను ముగ్గులోకి దింపడం..తర్వాత వారిని తన తల్లికి అప్పగించడమే పనిగా పెట్టుకున్నాడు..ఆ కిరాతకుడు. ఇదే క్రమంలో అనకాపల్లి జిల్లాకు చెందిన 17 ఏళ్ల బాలికను..ప్రేమపేరుతో మాయమాటలు చెప్పి పెద్దాపురం తీసుకువచ్చాడు. వాడి ప్రేమ నిజమేనని నమ్మిన బాలిక. .తల్లిదండ్రులను సైతం కాదని వాడితో వచ్చేసింది. బాలికను నమ్మించేందుకు పెళ్లికూడా చేసుకున్నాడు చందు. అయితే అత్తింటికి వచ్చిన తర్వాతే ఆ బాలికకు అసలు విషయం తెలిసింది.

వ్యభిచార కూపంలోకి దిగాలంటూ బాలికను బలవంతం చేసింది..చందు తల్లి నీలిమ. ఈ క్రమంలో బాలిక అనారోగ్యానికి గురవడంతో.. స్థానిక ఆర్‌ఎంపీతో వైద్యం చేయించింది. దీంతో బాధితురాలు మరింత అనారోగ్యానికి గురయింది. శారీరక బాధలతోపాటు తల్లి, కొడుకులు పెట్టే చిత్రహింసలు భరించలేక..గత నెల 28న చీమల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసింది. దీంతో చికిత్స కోసం బాధితురాలిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ బాలిక..కాళ్లు, చేతులు వంకర్లు పోయి కదలలేని స్థితికి చేరుకుంది. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు..ఆమెను ప్రస్తుతం విశాఖలోని విమ్స్‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. బాలిక మానసిక స్థితి కూడా క్షీణించడంతో ఆమె పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుపై పెద్దాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా స్థానికంగా ఉన్న వ్యభిచార గృహాలపై పోలీసులు నిఘా పెట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసులు మామూళ్ల మత్తులో జోగడం వలనే అమాయకుల జీవితాలు నాశనం అవుతున్నాయని మండిపడుతున్నారు స్థానికులు. మరోవైపు వ్యభిచార గృహాలపై రెయిడ్స్‌ చేసే అధికారం కేవలం ఇన్స్‌పెక్టర్‌ స్థాయి అధికారికే ఉందన్న విషయం తెలిసీ..నిర్వాహకులు కిందిస్థాయి పోలీసులను పట్టించుకోవడం లేదన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇప్పటికైనా పెద్దాపురంలో వ్యభిచార వృత్తిని కూకటివేళ్లతో పెకలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి