AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: ఒంగోలు ప్రజలకు పండుగలాంటి వార్త.. కల సాకారమయ్యే టైమ్ వచ్చేసిందోచ్

గన్నవరం..విశాఖ..మాత్రమే కాదు ఇక ఒంగోలు నుంచి కూడా విమానయానం అందుబాటులోకి వచ్చేస్తోంది.. ఎన్నాళ్లుగానో వేచిచూస్తోన్న ఒంగోలు విమాన కల సాకారం కాబోతుంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో భూసేకరణ , ఏయిర్‌పోర్టు నిర్మాణానికి ప్రణాళికలు శరవేగంగా జరుగుతున్నాయి. ఏయిర్‌ పోర్ట్‌ అధార్టీ బృందం వాన్‌పిక్‌ భూములను పరిశీలించింది.అల్లూరు-ఆలూరు మధ్యలో విమానాశ్రయ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది.

AP News: ఒంగోలు ప్రజలకు పండుగలాంటి వార్త.. కల సాకారమయ్యే టైమ్ వచ్చేసిందోచ్
Ongole
Ravi Kiran
|

Updated on: Jan 28, 2025 | 9:05 PM

Share

ప్రకాశం జిల్లాలో ఎయిర్‌పోర్టు కల సాకారమయ్యే టైమ్‌ వచ్చేసింది. కూటమి సర్కార్‌ చొరవతో  ఒంగోలు ఎయిర్‌పోర్టు స్వప్నం సాకారం కాబోతుంది.  సియం చంద్రబాబు నాయుడు చొరవతో  ఏపీలో కొత్తగా ఏడు ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు కేంద్రం  గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఒంగోలు సహా ఏపీలో  7 కొత్త ఏయిర్‌పోర్టుల నిర్మాణాలు చేపట్టనున్నట్టు  ప్రకటించారు కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు. ఒంగోలుకు సమీపంలోని అల్లూరు – ఆలూరు మధ్యలో  ఏయిర్‌ పోర్టు ఏర్పాటుకు అనుకూల భూములున్నాయని  రెవెన్యూ అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపించారు.. గతంలో వాన్‌పిక్‌ కోసం సేకరించిన భూముల్లో 732 ఎకరాలను కేటాయించే దిశగా ప్రణాళికలు సిద్దం పట్టాలెక్కాయి.

ఎయిర్‌పోర్ట్‌ అధారిటీ నుంచి అధికారుల బృందం ఒంగోలు పరిసర ప్రాంతాల్లో పర్యటించింది. ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌, నగర మేయర్‌ గంగాడ సుజాత, ఇతర జిల్లా అధికారులు బృందం సభ్యులతో కలిసి ఒంగోలు సమీపంలోని కొప్పోలు, అల్లూరు, ఆలూరు మధ్య ఉన్న వాన్‌పిక్‌ స్థలాలను పరిశీలించారు. ఇప్పటికే వాన్‌పిక్‌ ఆధీనంలో ఉన్న 600 ఎకరాలతో పాటు మరో 150 ఎకరాలు రైతుల నుంచి సేకరించాల్సి ఉంది. ఈ భూములు ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి అనువుగా ఉన్నాయా.. లేదా.. అన్న విషయంలో ఎయిర్‌పోర్ట్‌ అధికారుల బృందం అధికారుల నుంచి వివరాలు సేకరించారు. ప్రతిపాదిత స్థలం లేఅవుట్లను పరిశీలించారు. కూటమి సర్కార్‌ చొరవ వల్లే  ఎన్నో ఏళ్ల తమ  కల సాకారం అవుతుందని హర్షం వ్యక్తం  చేశారు స్థానికులు.

భూముల ధరలు పెరగడంతో  పాటు స్థానికంగ విద్యా, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయంటున్నారు. ఒంగోలు సమీపంలో ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణం వల్ల ప్రకాశం జిల్లా పారిశ్రా మికంగా అభివృద్ధి చెందుతోంది. తూర్పు ప్రకాశంలో ఇంతవరకు ఎలాంటి పెద్దపరిశ్రమలు లేకపోవడంతో కోస్తాతీరం అభివృద్ధి చెందలేదు. రానున్న రోజుల్లో ఒంగోలుసమీపంలో విమానాశ్రయం, కొత్తపట్నం దగ్గర పోర్టు నిర్మిస్తే తూర్పు ప్రకాశం అభివృద్ధిలో అగ్రభాగం లోఉండే అవకాశాలున్నాయి. ఈ పరిస్థితుల్లో కేంద్ర విమానయానసంస్థ అధికారులు ఒంగోలులో పర్యటించిన నేప ధ్యంలో జిల్లా ప్రజల్లో విమానాశ్రయం ఆశలు చిగురిస్తున్నాయి… విమానాశ్రయం ఏర్పాటుకు ఎపిఎడిసికి 1.92 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడంతో జిల్లా ప్రజల్లోపూర్తిస్థాయి నమ్మకం ఏర్పడింది. ప్రతిపాదనలు పట్టాలెక్కాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి