AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: సీఎం చంద్రబాబు కేసులపై తీవ్రస్థాయిలో మండిపడ్డ సుప్రీంకోర్టు..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై సీఐడీ నమోదు చేసిన కేసులను సీబీఐకి బదిలీ చేయాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. సిఐడి కేసులను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌కు బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం(జనవరి 28) కొట్టివేసింది. ఇదో పనికిమాలిన కేసు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాదికి గట్టిగానే మొట్టికాయలు వేసింది.

Andhra Pradesh: సీఎం చంద్రబాబు కేసులపై తీవ్రస్థాయిలో మండిపడ్డ సుప్రీంకోర్టు..!
Sc On Chandrababu
Balaraju Goud
| Edited By: Rajeev Rayala|

Updated on: Jan 29, 2025 | 7:21 AM

Share

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడకు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. చంద్రబాబుపై ఉన్న సీఐడీ కేసుల్ని సీబీఐకి బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. ఈ పిటిషన్‌ దాఖలు చేసిన పిటిషనర్‌ తరఫున వాదనలు వినిపించడానికి సుప్రీంకోర్ట్ లాయర్ సిద్ధమవుతుండగా.. ఇలాంటి పిటిషన్లను మీరు వాదిస్తారా అని జస్టిస్ బేలా త్రివేది ప్రశ్నించారు. ఇలాంటి కేసుల్లో సీనియర్లు వాదిస్తారని అస్సలు ఊహించలేదన్నారు. ఇది పూర్తిగా తప్పుడు పిటిషన్‌ అని.. పిటిషన్‌కి సంబంధించి ఒక్క మాట మాట్లాడినా పెద్దమొత్తంలో జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఒక్క మాట కూడా వినకుండానే పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్‌ చేసింది.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబుపై సీఐడీ వరుసగా కేసులు నమోదు చేసింది. స్కిల్ డెవలప్‌మెంట్‌, అమరావతి ఇన్నర్ రింగ్‌ రోడ్డు, ఏపీ ఫైబర్ నెట్‌, రాజధాని భూములు, అమరావతి అసైన్డ్ భూములు, ఉచిత ఇసుక, మద్యం విధానం లాంటి అంశాలపై సీఐడీ కేసులు నమోదు చేసింది. ఈ కేసుల్ని సీబీఐకి అప్పగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొట్టివేసింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో 2023, అక్టోబర్ 31న చంద్రబాబుకు ఏపీ హైకోర్ట్‌ ముందుగా మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అదే ఏడాది నవంబర్ 20న పూర్తిస్థాయి రెగ్యులర్ బెయిల్‌ మంజూరు చేసింది. అయితే బెయిల్ రద్దు చేయాలంటూ గత ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. తాజాగా మరో పిటిషనర్‌కు అక్షింతలు వేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!