AP News: ష్‌.! జాలర్లకు చిక్కిన అరుదైన చేపలు.. తిన్నారో రోగాలు వద్దన్నా వస్తాయ్

కొల్లేరులో మత్స్యకారులు ఆ చేపను చూసి బెంబేలెత్తిపోతున్నారు. మొన్నటిదాకా దెయ్యం చేప కొల్లేరు మత్స్యకారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తే.. తాజాగా అదే జాబితాలో మరో చేప ఆక్వా రంగ రైతులను భయపెడుతోంది. కొందరు రైతులు వాటిని తిరిగి చేపలకి ఆహారంగా వేస్తుంటే.. మరికొంతమంది మార్కెట్‌లో విక్రయిస్తున్నారు.

AP News: ష్‌.! జాలర్లకు చిక్కిన అరుదైన చేపలు.. తిన్నారో రోగాలు వద్దన్నా వస్తాయ్
Cat Fishes
Follow us
B Ravi Kumar

| Edited By: Ravi Kiran

Updated on: Jan 28, 2025 | 5:29 PM

క్యాట్ ఫిష్ పేరు సాధారణంగా అందరూ వినే ఉంటారు. ఇది చేపలలో ఓ రకం చేప. చేపలు తినడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారని, చేప మాంసంలో ఎక్కువ పోషకాలు ఉంటాయని చెబుతుంటారు. వాస్తవంగా మిగతా మాంసాహారాలతో పోల్చుకుంటే చేప మాంసంలోనే ప్రోటీన్లు, విటమిన్లు ఉంటాయి. కానీ క్యాట్ ఫిష్ మాంసంలో మాత్రం మనిషికి హాని కలిగించే విషరసాయనాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ చేపను పెంచడం కానీ, వాటి మాంసాన్ని విక్రయించడం కూడా నిషేధించారు. అయితే తాజాగా కొల్లేరు పరివాహక ప్రాంతాల్లో వరదల సమయంలో మురుగునీరు కాలువల ద్వారా కొల్లేరులోకి ఇవి వచ్చి చేరాయి.

చేపలు పట్టుకునే సమయంలో మత్స్యకారుల వలకు క్యాట్ ఫిష్‌లు సైతం చిక్కుతున్నాయి. అయితే ఇదే మాదిరిగా దెయ్యం చేపలు కూడా మత్స్యకారుల వలకు చిక్కి అపార నష్టాన్ని చేకూర్చడంతో వాటిని పట్టి చెరువుగట్లపై వదిలి వేస్తున్నారు. కానీ క్యాట్ ఫిష్‌లను అలా కాకుండా ముక్కలుగా కోసి కొన్ని చెరువులలో చేపలకు ఆహారంగా ఉపయోగిస్తున్నారు. అక్కడ వరకు బాగానే ఉంది. మరికొందరు అయితే వాటిని బహిరంగ మార్కెట్లో అమ్మేస్తున్నారు. క్యాట్ ఫిష్ చేప కొరమేను చేపను పోలి ఉంటుంది. క్యాట్ ఫిష్‌కు ఉన్న మీసాలు తీసేసి కొంతమంది దళారులు వాటిని తెలియని వారికి కొరమేను రూపంలో విక్రయిస్తున్నారు. అంతేకాక కొన్ని హోటల్స్‌ సైతం క్యాట్ ఫిష్ చేపలను తక్కువ ధరలకు కొని.. కస్టమర్లకు చేప మాంసం కింద అమ్మేస్తున్నారు.

అయితే తెలియక క్యాట్ ఫిష్ మాంసాన్ని తిన్న చేప మాంసం ప్రియులు అనారోగ్యం పాలవుతున్నారు. క్యాట్ ఫిష్‌లోనూ కొరమీనులానే ఒకే ముళ్లు ఉంటాయి. కానీ, ఈ చేపలను తినడం ఆరోగ్యానికి హానికరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. క్యాట్ ఫిష్‌లో ఉండే ఒమేగా-6 ఆమ్లాలతో మానవ నాడీ వ్యవస్థపై ప్రభావం చూపి నరాలు దెబ్బతినడంతో పాటు క్యాన్సర్ వ్యాధి వచ్చే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు. అంతేకాక క్యాట్ ఫిష్ దవడ కింద ఉండే ముళ్లు తింటే ప్రాణాలకే ప్రమాదం వాటిల్లుతుందని సూచిస్తున్నారు. కుళ్లిపోయిన వ్యర్ధాలను తిని పెరిగే ఈ చేపలను తింటే శరీరంలో కొత్త కొత్త రోగాలు వచ్చే అవకాశం ఉందని, ఈ చేపల విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యలు హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి